News
News
X

Mlc Kavitha : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు అత్యధిక వేతనాలు - ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగులకు అధిక జీతాలు చెల్లిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

FOLLOW US: 
Share:

Mlc Kavitha : దేశంలోనే ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సెర్ప్‌ ఉద్యోగులకు కొత్త పే సేల్‌ వర్తింపజేస్తూ జీవో విడుదల చేసినందుకు ఎమ్మెల్సీ కవితను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సెర్ప్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఉద్యోగులకు కొత్త పే స్కేల్ అమ‌లుకు ఉత్తర్వులు జారీ చేసినందుకు సెర్ప్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో  నాటి పాలకులు సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించేందుకు నిర్ణయించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు ఎమ్మెల్సీ కవిత. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వేతనాలు చెల్లిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో 3,978 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఏప్రిల్ 1 వ తేదీ నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లించనున్నారు. సెర్ప్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్‌రెడ్డి, ప్రతినిధులు ఎమ్మెల్సీ  కవితను కలిశారు.

ఏప్రిల్ 1 నుంచి కొత్త పే స్కేల్ 

 సెర్ప్ ఉద్యోగుల‌ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల‌కు నూతన పే స్కేల్( Pay Scale ) అమ‌లుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ప్ ఉద్యోగుల క‌నిష్ఠ పే స్కేలు రూ. 19 వేల నుంచి రూ. 58,850లకు పెంచగా, గ‌రిష్ఠ పేస్కేల్ రూ. 51,320 నుంచి రూ. 1,27,310లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పే స్కేల్ అమల్లోకి వస్తుంది. ఈ మేర‌కు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇటీవల జారీ చేసింది. 

  • మండ‌ల స‌మాఖ్య క‌మ్యూనిటీ కో-ఆర్డినేట‌ర్స్  వేతనం - రూ. 19,000 – 58,850
  • మండ‌ల స‌మాఖ్య క‌మ్యూనిటీ కో-ఆర్డినేట‌ర్స్‌( మండ‌ల రిప్రజెంటెటివ్స్) వేతనం – రూ. 19,000 – రూ. 58,850
  • డ్రైవ‌ర్స్ వేతనం – రూ. 22,900 – రూ. 69,150
  • ఆఫీస్ సబార్డినేట్స్ వేతనం – రూ. 19,000 – రూ. 58,850
  • మండ‌ల బుక్ కీప‌ర్స్ వేతనం – రూ. 22,240 – రూ. 67,300
  • క‌మ్యూనిటీ కో-ఆర్డినేట‌ర్స్ వేతనం – రూ. 24,280 – రూ. 72,850
  • అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజ‌ర్స్ వేతనం – రూ. 32,810 – రూ. 96,890
  • డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజ‌ర్స్ వేతనం – రూ. 42,300 – 1,15,270
  • ప్రాజెక్టు మేనేజ‌ర్స్ వేతనం – రూ. 51,230 – రూ. 1,27,310
  • అడ్మినిస్ట్రేష‌న్ అసిస్టెంట్ ప్రాజెక్టు సెక్రట‌రీస్ – రూ. 24,280 – రూ. 72,850 

ఏటా అదనంగా రూ.58 కోట్లు 

వేతన స్కేల్ పెంపు కోసం రెండు దశాబ్దాలుగా సెర్ప్‌ ఉద్యోగుల డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ డిమాండ్ కు ఓకే చెప్పింది. ఏప్రిల్‌ నెల నుంచి కొత్త పే స్కేల్ అమలుచేస్తామని ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా శనివారం ఉత్తర్వులు ఇచ్చింది.  దీంతో సెర్ప్‌లోని 3,974 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. సెర్ప్‌ ఉద్యోగులకు నూతన పేస్కేల్‌ అమలు చేయడం కోసం ప్రభుత్వం ఏటా రూ.58 కోట్లు అదనంగా వెచ్చించనుంది. ప్రస్తుతం సెర్ప్ ఉద్యోగులు వేతనాల కోసం ఏటా రూ.192 కోట్లు చెల్లిస్తుంది. సెర్ప్‌ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పొందవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

Published at : 19 Mar 2023 09:54 PM (IST) Tags: Hyderabad Salaries MLC Kavitha new pay scale SERP Employees

సంబంధిత కథనాలు

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!