Hyderabad News : ఆడపిల్ల పుట్టిందని భార్యను పుట్టింటిలో వదిలేసిన భర్త, విడాకుల కోసం ఒత్తిడి!
Hyderabad News : హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని భార్యను పట్టింటిలో వదిలేశాడు ఓ వ్యక్తి.
Hyderabad News : హైదరాబాద్ రాజేంద్రనగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఆడపిల్లకు జన్మ నిచ్చిందని భార్యను పుట్టింటిలో వదిలేశాడో రాహుల్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆడపిల్ల పుట్టిందని రాహుల్ కనీసం ఆసుపత్రికి కూడా రాలేదని యువతి తల్లిదండ్రులు అంటున్నారు. తనకు ఆడ పిల్ల వద్దు విడాకులు ఇస్తే వేరే వివాహం చేసుకొంటున్నాడని తెలిపారు. 18 నెలల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాహుల్ తో శకుంతల వివాహం జరిగింది. వివాహ సమయంలో కోటిన్నర ఖరీదైన ప్లాట్, 50 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలు కట్నంగా ఇచ్చి గ్రాండ్ గా వివాహం చేశారు శకుంతల తల్లిదండ్రులు. ఇప్పుడు ఆడ బిడ్డ పుట్టిందని తమ కుమార్తెను వదిలేస్తానని అంటున్నాడని ఆవేదన చెందుతున్నారు. ఆడ బిడ్డ పుట్టడమే తప్పు అన్నట్లు రాహుల్ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారని, ఇప్పటి వరకు కనీసం బిడ్డను చూడలేదని అంటున్నారు. ఆ బిడ్డ తనకు పుట్టలేదని రాహుల్, అతడి తల్లిదండ్రులు అంటున్నారని ఆవేదన చెందారు. చంటి బిడ్డను తీసుకొని రాహుల్ ఇంటికి వెళితే ఇంటికి తాళం వేసి ఉందని శకుంతల తల్లిదండ్రులు తెలిపారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు శకుంతల వేడుకుంటున్నారు.
కూతురి మృతదేహంతో బైక్ పై 50 కిలోమీటర్లు
ఓ వైపు గుండె పగిలే బాధ. మరోవైపు చేతుల్లో కూతురు శవం. ఇంత ఆవేదన, దు:ఖం చాలదన్నట్లు వాళ్లు వెళ్లేందుకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ దంపతులు.. కూతురు శవాన్ని చేతుల్లో పట్టుకొనే 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇంటి వరకూ ద్విచక్ర వాహనంపైనే వెళ్లారు. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు చాలానే చూసినప్పటికీ ఖమ్మం జిల్లాలో (Khammam District News) మాత్రం ఇదే మొదటి సారి. ఖమ్మం జిల్లా (Khammam District News) లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో ఓ తండ్రి దీనగాధ అందరి చేత కన్నీరు పెట్టిస్తోంది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక అనారోగ్యంతో బాధపడుతూ... ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రిలో ఫ్రీ అంబులెన్స్ లేకపోవడం, ప్రైవేటు అంబులెన్సులో తీసుకెళ్లేందుకు డబ్బులు లేక ఏం చేయాలో తెలియని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఓ వైపు గుండె పగిలే బాధ, మరోవైపు కూతురు శవాన్ని ఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచన.. దిక్కుతోచని స్థితిలో బండిపైనే పయనం అయ్యారు. భర్త బండి నడుపుతుండగా.. భార్య పాప మృతదేహాన్ని పట్టుకొని వెనక కూర్చుంది. దాదాపు 50 కిలో మీటర్ల మేర ప్రయాణం చేస్తూ.. వాగు దాటుకుంటూ చివరకు ఇంటికి చేరుకున్నారు. ఈ దృశ్యం చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టారు.
అనారోగ్యంతో మృతి
కొత్త మేడేపల్లి గ్రామానికి చెందిన వెట్టి సుక్కి అనే ఆదివాసీ గిరిజన బాలిక రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఉచిత అంబులెన్స్ కోసం సిబ్బందిని సంప్రదించాడు. అంబులెన్స్ సౌకర్యం లేదని చెప్పడంతో ప్రైవేటు అంబులెన్స్, ఆటోలకు డబ్బులు చెల్లించలేకపోయిన తండ్రి.. తానే స్వయంగా మృతదేహాన్ని బైక్ పైనే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భార్య చేతిలో కూతురు శవాన్ని పెట్టి తాను బైకు నడుపుతూ ఇంటికి చేరుకున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఇంకా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమే.
Also Read : Gadwal News : ప్రేమ పేరుతో యువతుల ట్రాప్, న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసి బెదిరింపులు!