అన్వేషించండి

Gadwal News : ప్రేమ పేరుతో యువతుల ట్రాప్, న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసి బెదిరింపులు!

Gadwal News : యువతుల న్యూడ్ కాల్స్ సోషల్ మీడియో పెట్టి బెదిరించిన ఘటనలో గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కేసులో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

Gadwal News : న్యూడ్ వీడియో కాల్స్ చిత్రీకరించి యువతులను వేధించిన ఘటన గద్వాల జిల్లాలో వెలుగుచూసింది. యువతుల న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళల ‌న్యూడ్ కాల్స్ కేసులో ఒకరిని అరెస్టు‌ చేశారు  పోలీసులు. మరొకరి కోసం గాలిస్తున్నారు. అయితే వంద మహిళల ట్రాప్ వాస్తవం కాదంటున్నారు పోలీసులు. ఇంతకు గద్వాలలో ఏం జరిగింది.

అసలేం జరిగింది?  

 గద్వాల పట్టణానికి చెందిన తిర్మల్ అలియాస్ మహేశ్వర్ రెడ్డి గత కొంత కాలంగా యువతులను ట్రాప్ చేస్తున్నాడు. మాయ మాటలు చెప్పి వారితో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్నాడు‌. ఇలా న్యూ డ్ గా మాట్లాడుతున్న వీడియోలను రికార్డు చేశాడు‌. మహేశ్వర్ రెడ్డి ఫోన్లో ఉన్న ఆ న్యూడ్ వీడియోలను అతనికి తెలియకుండా తీసుకున్నారు మరో ఇద్దరు యువకులు. ఆ తర్వాత మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వర్ రెడ్డి ఆ ఇద్దరు యువకులతో గొడవపడ్డాడు. దీంతో వారిలో ఓ యువకుడు ఆ న్యూడ్ వీడియోను తన స్టేటస్ లో పెట్టాడు. ఆ వెంటనే తొలగించినప్పటికీ అది వైరల్ అయింది. రెండు నెలలుగా ఈ వ్యవహారం సాగుతోంది. చివరకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది‌.

వంద మంది మహిళల ట్రాప్ అవాస్తవం 

ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు నాయకుల ప్రమేయం ఉన్నట్లు చర్చ జరిగింది. మహిళలు తీవ్రంగా వేధించారని శారీరకంగా, ఆర్థికంగా వేధింపులకు గురయ్యారని సోషల్ మీడియా లో వైరల్ అయింది.  దీంతో పోలీసులు మహేశ్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో నిందితుడు నిఖిల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు‌. పోలీసుల బృందం ఈ ఘటనపై వివారణ చేపట్టారు. గద్వాలలో హనీ ట్రాప్ జరిగిందని, చాలా సున్నితమైన విషయం కాబట్టి సుమోటోగా కేసు నమోదు చేయాలని మరోవైపు మహిళల ప్రైవసీ దెబ్బతినకుండా విచారణ జరిపి, ఎంతటి వారైన కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా విచారణ కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. మహిళలు ఎవరూ ఫిర్యదు చేయలేదని, సున్నితమైన విషయం కాబట్టి సుమోటోగా కేసు నమోదు చేసి తిర్మల్ అలియాస్ మహేశ్వర్ రెడ్డిని అరెస్టు చేశామన్నారు. నిఖిల్ కోసం గాలిస్తున్నామని డీఎస్పీ రంగాస్వామి తెలిపారు.  వంద మంది మహిళలను ట్రాప్ చేశారని, బ్లాక్ మెయిల్ చేశారనే వార్తల్లో వాస్తవం లేదని చెబుతున్నారు.

సోషల్ మీడియా పరిచయాలు 

సోషల్‌ మీడియాలో కొత్త పరిచయాలు పెడదారులు పడుతున్నాయి. చాటింగ్ తో పరిచయం మొదలై వ్యక్తిగత సమాచారంతో పాటు ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునే స్థాయికి వెళ్తోంది. నంబర్లు మార్చుకుని వీడియో కాల్స్ చేసుకుంటున్నారు. వాట్సాప్‌ చాట్స్‌, వీడియో కాల్స్‌తో దగ్గరవుతూ మాయ మాటలు చెప్పి న్యూడ్ కాల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తున్నా ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి కొత్త పరిచయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Madhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | బాణం వేసిన మాధవి లత... అది మసీదు వైపే వేశారా..?RK Roja Files Nomination | నగరిలో నామినేషన్ వేసిన రోజా... హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిKiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Embed widget