By: ABP Desam | Updated at : 28 Jul 2022 02:53 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
Hyderabad Command Control Center : హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దేశంలో అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ నిర్మాణం చేపట్టారు. వందల కోట్లతో వ్యయంతో 18 అంతస్తులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు.
ఆగస్టు 4న ప్రారంభం
హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 4న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ సెంటర్ ను ప్రారంభం కానుంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్‌లో మరో ఆకర్షణగా నిలవనుంది. నేరాలను క్షణాల్లో పసిగట్టేందుకు అత్యధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో సీసీసీని హైదరాబాద్‌లో నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ నిర్మాణం చేపట్టింది. వందల కోట్లతో 18 అంతస్తులతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం చేపట్టారు.
సందర్శకులకు అనుమతి
పోలీస్ కమాండ్ కంట్రోల్ 18 అంతస్తులున్న ఈ భవనాన్ని సందర్శించేందుకు 14, 15 అంతస్తుల వరకు వెళ్లేందుకు అనుమతిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు. అయితే టికెట్లు కొన్నవారికే మాత్రమే అనుమతి ఇస్తారు. 6వ అంతస్తులోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వచ్చి బయటనుంచి పోలీసులు చేస్తున్న ఆపరేషన్‌ను వీక్షించేందుకు సందర్శకులను అనుమతిస్తారు.
7 ఎకరాల విస్తీర్ణంలో
ఈ కమాండ్ సెంటర్ భవనాన్ని లక్షా 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రదేశాన్ని 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుంది. ఈ బిల్డింగ్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని ఏ ప్రదేశంలో ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టొచ్చు అని పోలీసులు అంటున్నారు. ఈ భవనం నిర్మాణం కోసం రూ.350 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టగా, తర్వాత మరో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ భవనాన్ని 7 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో 4 బ్లాకుల్లో A, B, C, D కమాండ్ కంట్రోల్ సెంటర్ టవర్లు నియమించారు. టవర్-A గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 84.2 మీటర్ల ఎత్తులో ఉంటుంది. టవర్-B, C, Dలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో నిర్మించారు. సీసీసీలో ముఖ్యమైంది ఆఫీస్ బిల్డింగ్ టవర్-A, హెలిప్యాడ్‌తో కలిపి జీ ప్లస్ 20 అంతస్తుల్లో టవర్-A నిర్మించారు. ఓపెన్ ఆఫీస్ మీటింగ్ రూమ్స్ కాన్ఫరెన్స్ రూం క్యాబిన్లు సీసీసీలో ఉంటాయి.
Koppula Eashwar: సుప్రీంకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్కి చుక్కెదురు, 2018 నాటి కేసులో కీలక మలుపు
తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!
Breaking News Live Telugu Updates: భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులు చేస్తాం - బండి సంజయ్ వ్యాఖ్యలు
భార్యకు కు.ని. ఆపరేషన్ అన్నాడు- పిల్లల్ని ఖూనీ చేశాడు
Mobile Hospital: ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్ ఆస్పత్రి, గిరిజనుల కోసం మెగా వైద్య శిబిరం!
Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్న్యూస్, తెలంగాణ సర్కార్కు షాక్ - కీలక తీర్పు