Osmania University High Tension : ఓయూలో మళ్లీ ఉద్రిక్తత, రాహుల్ సభ ఇష్యూపై కొనసాగుతున్న ఆందోళనలు
Osmania University High Tension : ఓయూలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు.
Osmania University High Tension : హైదరాబాద్ ఓయూలో విద్యార్థుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ పర్యటనకు ఓయూ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో గత రెండు రోజులుగా ఓయూలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి నిరసనలు చేపట్టకుండా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ ఫ్రంట్ ఛైర్మన్, పరిశోధన విద్యార్థి దయాకర్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పరిశోధన విద్యార్థులను అరెస్టు చేయడంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ట్స్ కళాశాలలో ఉద్రిక్తత
ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీ పర్యటనకి అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ ఆర్ట్స్ కళాశాల ఓయూ స్కాలర్ విద్యార్థులు ఆందోళన చేశారు. పోలీసుల కళ్లు కప్పి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘాల నేతలు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్టేషన్ కి తరలించారు.
ఓయూ కి రాహుల్ గాంధీ గారు వస్తా అంటే కేసిఆర్ కి ఎందుకు అంత భయం? రాహుల్ గాంధీ గారిని ఆపడానికి ఎందుకు కేసిఆర్ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు?
— Telangana Congress (@INCTelangana) May 2, 2022
మొన్న కర్ణాటక బీజేపీ ఎంపీ, తేజస్వి సూర్య ను మాత్రం ఓయూ కి పంపిండు కదా కేసిఆర్...
బీజేపీ & తెరాసా.. ఇద్దరూ ఒక్కటే!
రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్తాం : జగ్గారెడ్డి
రాహుల్ తెలంగాణ పర్యటనలో భాగంగా 6వ తేదీన వరంగల్ లో రైతు సభలో పాల్గొంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ఓయూ విజిట్ కోసం అనుమతి కోరితే రిజెక్ట్ చేశారన్నారు. నిన్న పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారన్నారు. స్టూడెంట్స్ అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంచల్ గూడ జైల్లో ఉన్న ఎఎస్యూఐ నేతలను టీపీసీసీ బృందం పరామర్శించింది. సర్కార్ ఓయూ విజిట్ అనుమతి ఇవ్వకపోయినా రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళతామన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యకు సర్కారే బాధ్యత వహించాలన్నారు.
Also Read : Rahul Tour In Telngana : చంచల్ గూడ జైలుకు రాహుల్ గాంధీ - రేవంత్ రెడ్డి వ్యూహం !