GST 2.0 తర్వాత Honda కార్లపై రూ.1.20 లక్షల వరకు సేవింగ్ - Amaze, City & Elevate పాత-కొత్త రేట్లు
Honda కార్లపై GST 2.0 ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. Honda Amaze, City & Elevate మోడళ్ల ధరలు రూ. 40,000 నుంచి రూ. 1.20,000 లక్షల వరకు తగ్గాయి.

Honda Cars Price Drop After GST 2.0: జీఎస్‌టీ 2.0 రాకతో ఆటోమొబైల్ మార్కెట్‌లో పాజిటివ్ వైబ్ ఏర్పడింది. పాపులర్ బ్రాండ్ హోండా కూడా తన మోడళ్ల ధరల్లో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. Honda Amaze, City & Elevate - ఈ మూడు మోడళ్లకూ భారీగా ధరలు తగ్గడం కస్టమర్లకు గుడ్ న్యూస్.
Honda Amaze - కాంపాక్ట్ సెడాన్‌కు కొత్త ఊపు
హోండా అమెజ్ ఇప్పుడు యువతరానికి మరింత సులభంగా అందుబాటులోకి వచ్చింది. పాత S MT వేరియంట్ ధర ₹7.62 లక్షలు ఉండగా, ఇప్పుడు ₹6.97 లక్షలకు పడిపోయింది. అంటే సూటిగా ₹65 వేల తగ్గింపు. టాప్ ZX CVT వేరియంట్‌లో అయితే బంపర్ కట్ కనిపించింది, ₹1.20 లక్షల భారీ తగ్గింపుతో కొత్త ఎక్స్ షోరూమ్ ధర ₹9.99 లక్షలు అయింది. ఈ కాంపాక్ట్ సెడాన్ ఇప్పుడు మళ్లీ Maruti Suzuki Dzire తో డైరెక్ట్ పోటీలోకి వచ్చేసింది.
| Honda Amaze వేరియంట్ | పాత ధర | కొత్త ధర | సేవింగ్ |
|---|---|---|---|
| S MT (old gen) | రూ. 7,62,800 | రూ. 6,97,700 | రూ. 65,100 |
| S CVT (old gen) | రూ. 8,52,600 | రూ. 7,79,800 | రూ. 72,800 |
| V MT | రూ. 8,09,900 | రూ. 7,40,800 | రూ. 69,100 |
| V CVT | రూ. 9,34,900 | రూ. 8,55,100 | రూ. 79,800 |
| VX MT | రూ. 9,19,900 | రూ. 8,41,400 | రూ. 78,500 |
| VX CVT | రూ. 9,99,900 | రూ. 9,14,600 | రూ. 85,300 |
| ZX MT | రూ. 9,99,900 | రూ. 9,14,600 | రూ. 85,300 |
| ZX CVT | రూ. 11,19,900 | రూ. 9,99,900 | రూ. 1,20,000 |
Honda Elevate - SUV లుక్స్‌తో మరింత చవక
హోండా ఎలివేట్ ధరల్లో కూడా పెద్ద మార్పు జరిగింది. బేస్ SV MT ధర ₹11.91 లక్షల నుంచి ₹10.99 లక్షలకు పడిపోయింది. అంటే ₹91,100 తగ్గింపు. టాప్ ZX CVT డ్యూయల్ టోన్ వేరియంట్ ధర కూడా ₹58,400 తగ్గి ₹16.34 లక్షలకు వచ్చింది. ఇతర వేరియంట్లలో ₹42,800 నుంచి ₹57,700 వరకు తగ్గాయి.
| Honda Elevate వేరియంట్ | పాత ధర | కొత్త ధర | సేవింగ్ |
|---|---|---|---|
| SV MT | రూ. 11,91,000 | రూ. 10,99,900 | రూ. 91,100 |
| V MT | రూ. 12,39,000 | రూ. 11,96,200 | రూ. 42,800 |
| V CVT | రూ. 13,59,000 | రూ. 13,12,100 | రూ. 46,900 |
| VX MT | రూ. 14,10,000 | రూ. 13,61,300 | రూ. 48,700 |
| VX CVT | రూ. 15,30,000 | రూ. 14,77,200 | రూ. 52,800 |
| ZX MT | రూ. 15,41,000 | రూ. 14,87,800 | రూ. 53,200 |
| ZX MT Black Edition | రూ. 15,51,000 | రూ. 14,97,500 | రూ. 53,500 |
| ZX MT Ivory | రూ. 15,51,000 | రూ. 14,97,500 | రూ. 53,500 |
| ZX CVT | రూ. 16,63,000 | రూ. 16,05,600 | రూ. 57,400 |
| ZX CVT Black Edition | రూ. 16,73,000 | రూ. 16,15,300 | రూ. 57,700 |
| ZX CVT Ivory | రూ. 16,73,000 | రూ. 16,15,300 | రూ. 57,700 |
| ZX CVT Dual Tone | రూ. 16,83,000 | రూ. 16,24,900 | రూ. 58,100 |
| ZX CVT Dual Tone Ivory | రూ. 16,93,000 | రూ. 16,34,600 | రూ. 58,400 |
Honda City - ప్రీమియం సెడాన్‌కి ఆకర్షణీయమైన ధర
City ఎప్పటికీ హోండా బ్రాండ్‌కి ఐకాన్ కార్. ఇప్పుడు దీని ధరల్లో కూడా కూల్ కట్ వచ్చింది. V CVT ధర ₹50,000 తగ్గి ₹13.90 లక్షలకు చేరింది. ZX CVT ధర కూడా ₹57,500 తగ్గి ₹16.07 లక్షలు అయింది. సిటీ హైబ్రిడ్ e:HEV ధరలో కూడా ₹41,790 తగ్గింపుతో ఇప్పుడు కొత్త ప్రైస్ ₹19.48 లక్షలు.
| Honda City వేరియంట్ | పాత ధర | కొత్త ధర | సేవింగ్ |
|---|---|---|---|
| SV MT | రూ. 12,38,000 | రూ. 11,95,300 | రూ. 42,700 |
| V MT | రూ. 13,14,900 | రూ. 12,69,500 | రూ. 45,400 |
| V CVT | రూ. 14,39,900 | రూ. 13,90,200 | రూ. 49,700 |
| VX MT | రూ. 14,21,900 | రూ. 13,72,800 | రూ. 49,100 |
| VX CVT | రూ. 15,46,900 | రూ. 14,93,500 | రూ. 53,400 |
| ZX MT | రూ. 15,39,900 | రూ. 14,86,800 | రూ. 53,100 |
| ZX CVT | రూ. 16,64,900 | రూ. 16,07,400 | రూ. 57,500 |
| Sports CVT | రూ. 14,88,900 | రూ. 14,37,500 | రూ. 51,400 |
| e:HEV | రూ. 19,89,900 | రూ. 19,48,200 | రూ. 41,790 |
Honda City Sports వేరియంట్‌కి అదనపు అట్రాక్షన్
సిటీ స్పోర్ట్స్ CVT ధర ₹51,400 తగ్గి ఇప్పుడు ₹14.37 లక్షలకు లభిస్తోంది. స్టైలిష్ లుక్స్‌తో ఈ వేరియంట్ యూత్‌కు మంచి ఆప్షన్‌గా మారింది.
హోండా ఈ ధర తగ్గింపులతో పాటు ప్రత్యేక ఫెస్టివ్ ఆఫర్లు కూడా ఇస్తోంది. దీంతో డ్రీమ్ కార్ కొనాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్.





















