అన్వేషించండి

Royal Enfield సెప్టెంబర్ సేల్స్‌లో కొత్త రికార్డ్ - GST 2.0 బూస్ట్‌తో ఏకంగా 1.24 లక్షల యూనిట్లు విక్రయం

2025 సెప్టెంబర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ 1.24 లక్షల బైక్‌లను అమ్మి ఆల్‌-టైమ్‌ రికార్డ్‌ సృష్టించింది. GST 2.0 ప్రభావం, ఫెస్టివ్‌ సీజన్‌ డిమాండ్‌ ఈ సేల్స్‌కు బూస్ట్‌ ఇచ్చాయి.

Royal Enfield Sales September 2025: సెప్టెంబర్‌ 2025 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి చరిత్రలో నిలిచిపోయే నెలగా మారింది. ఆ ఒక్క నెలలోనే 1.24 లక్షలకు పైగా యూనిట్లు అమ్మి ఆల్‌టైమ్‌ హయ్యెస్ట్‌ రికార్డును ఈ కంపెనీ క్రియేట్‌ చేసింది.       

డొమెస్టిక్‌ మార్కెట్‌ నుంచి మెజారిటీ సపోర్ట్‌
దేశీయ మార్కెట్లోనే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అత్యధిక డిమాండ్‌ కనబరిచింది. సెప్టెంబర్‌లో 1,13,573 యూనిట్లు సేల్‌ అవ్వగా, ఎగుమతులుగా 10,755 యూనిట్లను పంపింది. అంటే మొత్తం సేల్స్‌లో 91% దేశీయ మార్కెట్‌ నుంచి, ముఖ్యంగా యంగ్‌స్టర్స్‌ నుంచే వచ్చింది.        

సబ్‌ 350 cc - బలమైన వెన్నెముక
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి సబ్‌ 350 cc మోడల్స్‌ మళ్లీ వెన్నెముకలా నిలిచాయి. ఈ విభాగంలో మొత్తం 1,07,478 యూనిట్లు అమ్ముడుపోయి, మొత్తం సేల్స్‌లో 86% వాటా సాధించాయి. వీటి సేల్స్‌ గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 42% వృద్ధి చెందింది. 350 cc పైబడి ఉన్న మోడల్స్‌ కూడా మంచి పెరుగుదల సాధించాయి, 16,850 యూనిట్ల విక్రయాలతో 45% గ్రోత్‌ రికార్డ్‌ చేశాయి.        

విభాగం

2025 సెప్టెంబర్‌ సేల్స్‌

2024 సెప్టెంబర్‌ సేల్స్‌

ఏడాది వ్యవధిలో వృద్ధి %

350cc ఇంజిన్‌ లోపు

1,07,478

75,331

42.67

350cc ఇంజిన్‌ కంటే ఎక్కువ

16,850

11,647

44.67

దేశీయ అమ్మకాలు

1,13,573

79,326

43.17

ఎగుమతులు

10,755

7,652

40.55

మొత్తం

1,24,328

86,978

42.94

ఏడాది ప్రాతిపదికన వృద్ధి
సరిగ్గా ఏడాది క్రితం, అంటే, 2024 సెప్టెంబర్‌లో 86,978 యూనిట్లు అమ్మిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, 2025 సెప్టెంబర్‌లో 1.24 లక్షలకు దూసుకెళ్లింది. ఏడాదిలో ఇది 42.94% YoY వృద్ధి. ఎగుమతుల పరంగా కూడా మంచి ప్రగతి కనబర్చింది, గత ఏడాదితో పోలిస్తే 40% పెరిగింది.       

క్వార్టర్లీ సేల్స్‌లో కంటిన్యూ అవుతున్న పాజిటివ్‌ ట్రెండ్‌
2005-26 రెండో త్రైమాసికంలో (2025 జులై-సెప్టెంబర్‌ కాలం) రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మొత్తం 3,26,375 యూనిట్లు విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇప్పుడు 43% ఎక్కువ టూవీలర్లు అమ్ముడయ్యాయి. 2005-26 మొదటి ఆరు నెలల్లో, అంటే, 2025 ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో 5,91,903 యూనిట్లు అమ్మబడగా, 2024 ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో 4,54,779 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.   

    

ఫెస్టివ్‌ సీజన్‌ & GST 2.0 ప్రభావం
GST 2.0 సంస్కరణల వల్ల ధరలు తగ్గడం, ఫెస్టివ్‌ సీజన్‌లో బైక్‌ల డిమాండ్‌ పెరగడం - ఈ రెండు ఫ్యాక్టర్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి డబుల్‌ బూస్ట్‌ ఇచ్చాయి.     

చెన్నై బేస్‌గా పని చేస్తున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, త్వరలోనే 350 cc, 450 cc, 650 cc సెగ్మెంట్లలో కొత్త మోడల్స్‌తో పాటు ఎలక్ట్రిక్‌ బైక్‌ రేంజ్‌ను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. మొత్తంగా చూస్తే, 2025 సెప్టెంబర్‌ సేల్స్‌తో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మళ్లీ తన లీడర్‌షిప్‌ని ప్రూవ్‌ చేసుకుంది. యువతరానికి ఈ బైకులపై ఎంత మోజు ఉందో, ధరలు అందుబాటులోకి వస్తే సేల్స్‌ ఏ రేంజ్‌లో పెరుగుతాయో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. రాబోయే నెలల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సేల్స్‌ మరింత పెరుగుతాయని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు.      

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget