News
News
X

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి వైద్య కళాశాల ఓరియంటేషన్ డే కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు.

FOLLOW US: 
Share:

Minister Mallareddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తన కుమారుడిని డాక్టర్ చేస్తే తనకు మరో డాక్టర్ కోడలుగా వచ్చిందన్నారు. అదే తన కుమారుడికి ఆ అమ్మాయితో కాకుండా మరో అమ్మాయితో పెళ్లి చేసుంటే కిట్టీ పార్టీలు, పిక్నిక్ లు అంటూ తిరిగేదని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ గా మారాయి. సోమవారం మల్లారెడ్డి వైద్య కళాశాలలో ఓరియంటేషన్ డే కార్యక్రమంలో  విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్య లు వైరల్ అయ్యాయి. 

"నా కొడుకుని డాక్టర్ చదువుకు పంపిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ గా వచ్చింది. అదే రెడ్డి అమ్మాయిని చేస్తే పార్టీలు, కిట్టీ పార్టీ, పిక్నిక్ లు అంటూ తిరిగేది." అని మల్లారెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి వివరణ ఇచ్చారు. అదేదో ఫ్లోలో వచ్చిన మాటలని, కావాలని చేసిన వ్యాఖ్యలు కావన్నారు. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని వీడియో రిలీజ్ చేశారు మల్లారెడ్డి. 

 మల్లారెడ్డి ఏమన్నారంటే? 

మంత్రి మల్లారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తన కుమారుడిని డాక్టర్ చేస్తే.. తనకు మరో డాక్టర్ కోడలుగా వచ్చిందని ఎమోషనల్ అయ్యారు. అదే తన కుమారుడికి ఆ అమ్మాయితో కాకుండా మరో అమ్మాయితో పెళ్లి చేసుంటే.. కిట్టీ పార్టీలు, పిక్నిక్ లు అంటూ తిరిగేదని కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ గా మారాయి. ఓ కళాశాల కార్యక్రమానికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి... పుట్టిన రోజులు, పిక్నిక్ లు లాంటివి ఉండొద్దని, ఇలాంటి వాటివి చేస్తూనే తల్లిదండ్రులు పిల్లలను పాడు చేస్తున్నారని అన్నారు. కొన్ని సాధించాలంటే కొన్నింటికి వారిని దూరంగా ఉంచాలన్నారు. ప్రేమ, స్నేహం అన్నింటికీ దూరంగా ఉండాలని చెప్పారు. పిల్లలను ఎంత క్రమశిక్షణతో పెంచితే అంత మంచి స్థాయికి వస్తారని మంత్రి వెల్లడించారు. విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. భూమి అమ్మి మరీ కుమారుడిని ఎంబీబీఎస్ చదివించానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని... తనకు ఎలాంటి కోరికలు లేవన్నారు. కుమారుడిని డాక్టర్ చేస్తే... మరో డాక్టర్ తనకు కోడలుగా వచ్చిందన్నారు. అలా కాదని తాను రెడ్డి అమ్మాయిని కుమారుడికి ఇచ్చి చేసుంటే పార్టీలు, ఫంక్షన్ల వెంట తిరిగేదన్నారు. తన కోడలుకు అమ్మా, నాన్నలు లేరని.. తన కోడలు తనకు మూడో కుమారుడిలాగా అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. 

ఐటీ దాడులపై 

ఇటీవలే తనపై జరిగిన ఐటీ దాడుల గురించి మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తన దగ్గర ఏం దొరక్కపోవడంతో ఐటీ అధికారులు నిరాధారమైన ఆరోపణలు చేసి వెళ్లిపోయారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. తనది ఓపెన్ హార్ట్ అని, మనసులో ఏం దాచుకోనని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల్లో అంతా ఆన్ లైన్ లోనే సిస్టమ్ నడుస్తోందని.. తామెక్కడూ డొనేషన్లు వసూలు చేయలేదని మంత్రి వెల్లడించారు.  మొత్తం 400 మంది ఐటీ అధికారులు దాడులు చేశారని.. వారందరికీ ఏమీ దొరక్క అనవసర ఆరోపణలు చేసి వెళ్లిపోయారన్నారు. తాను ఏం తప్పు చేయలేదని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. 

Published at : 05 Dec 2022 09:33 PM (IST) Tags: Hyderabad TS News Sorry Kitty Party Minster Mallareddy

సంబంధిత కథనాలు

Union Budget 2023: తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ.12, 824 కోట్లు కేటాయించాం: రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్

Union Budget 2023: తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ.12, 824 కోట్లు కేటాయించాం: రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

Congress On Governor : బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే, గవర్నర్ ప్రసంగంతో డ్రామా బట్టబయలు- మహేష్ కుమార్ గౌడ్

Congress On Governor : బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే, గవర్నర్ ప్రసంగంతో డ్రామా బట్టబయలు- మహేష్ కుమార్ గౌడ్

వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !

Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు   !

టాప్ స్టోరీస్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల కీలక ప్రకటన !

Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల కీలక ప్రకటన !

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్