అన్వేషించండి

Minister Niranjan Reddy : కాళేశ్వరం ప్రాజెక్టులో లోపం లేదు, పంప్ హౌస్ లు మునిగిపోతే ప్రభుత్వానిదా తప్పు- మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి లోపం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరదతో పంప్ హౌస్ లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పంటారా? అని నిలదీశారు.

Minister Niranjan Reddy : పాలమూరు- రంగారెడ్డి(Palamuru Rangareddy) ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కృష్ణా నదిపై మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఆధారపడి ఉన్నాయని నిరంజన్ రెడ్డి అన్నారు. వరదల వల్ల కాళేశ్వరం(Kaleshwaram) పంప్‌హౌస్‌లు మునిగిపోవడంపై విపక్షాలు చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. చాలా సార్లు ఇటువంటి భారీ వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు మునిగిపోయాని స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఇంజినీర్‌ అయిన పెంటారెడ్డి(Pentareddy)పై అవమానకర వ్యాఖ్యలు చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

శ్రీశైలం ప్రాజెక్టు మునిగిపోలేదా? 

నాగార్జునసాగర్ ప్రాజెక్టును నెహ్రూ కట్టారంటారు. శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project)ను నీలం సంజీవరెడ్డి కట్టారంటారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వైఎస్ఆర్‌(YSR) కట్టారంటారు. కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్(KCR) గురించి మాత్రం మాట్లాడరు. నీటి లభ్యత ఉన్న చోటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ మహాద్భుతం అని ప్రపంచం కీర్తిస్తోంది. 28 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా కాళేశ్వరం నిర్మించారు. సాంకేతికంగా ఏ లోపం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. వరదతో పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పంటారా? 1998, 2009 లో శ్రీశైలం ప్రాజెక్టు మునిగిపోలేదా? నీటిరంగ నిపుణుడు పెంటారెడ్డిని అవమానిస్తారా? కాంగ్రెస్(Congress) హయాంలో పెంటారెడ్డి డిజైన్ చేసిన ప్రాజెక్టులు కట్టలేదా? - నిరంజన్​రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి లోపం లేదు 

ప్రాజెక్టులు నీటిలభ్యత ఉన్న ప్రాంతాల్లో కట్టాలంటున్నారని, కానీ జూరాల ప్రాజెక్టు(Jurala Project)ను నీటిలభ్యత ఉన్న ప్రాంతాల్లోనే కట్టారా అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. నీటిలభ్యత ఉన్న దగ్గర పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కడుతుంటే ఆటంకాలు కలిగించడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఇప్పటికే లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈ ప్రాజెక్టుపై 180 కేసులు వేశారని ఆరోపించారు. ఎవరెంత అడ్డుకున్నా ఏడాదిన్నరలోపు ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లో ఎటువంటి లోపంలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.  గోదావరి వరదలు(Godavari Floods) మానవ తప్పిదం కాదని, ప్రకృతి విపత్తు అని మంత్రి చెప్పారు. విపక్షపార్టీలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టడానికి 30 ఏళ్లు పట్టిందని విమర్శించారు. తాము మూడేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. 

Also Read : Komatireddy Rajagopal: కేసీఆర్ ఉచ్చులో అస్సలు పడను, అమిత్ షాను కలిశా - ఎమ్మెల్యే కోమటిరెడ్డి, పార్టీమార్పుపైనా వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget