Kukatpally Building Collapse : కూకట్ పల్లిలో కూలిన భవనం స్లాబ్, శిథిలాల కింద కూలీలు!
Kukatpally Building Collapse : కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.

Kukatpally Building Collapse : హైదరాబాద్ కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ స్లాబ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. కూకట్‌పల్లిలోని బీజేపీ ఆఫీస్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్థు స్లాబ్ శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో గాయపడిన కూలీలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇద్దరు కూలీలు ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సహాయచర్యలు చేపట్టారు.
శిథిలాల కింది ఇద్దరు కూలీలు
కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ప్రమాదం జరిగింది. 4, 5 వ అంతస్తుకు స్లాబ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. రెడీ మిక్స్ కింద ఇద్దరు కూలీలు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఒకరి తలకు గాయాలు అవ్వడంతో అతడ్ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామన్నారు. భవనం కూలిన ఘటనలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
శిథిలాల కింద వ్యక్తి కదలికలను గుర్తించిన రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారు ఆనంద్, భానుగా గుర్తించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

