Vandebharat Train: ఏపీ, తెలంగాణలో నేడు 2 కొత్త వందేభారత్‌లు - వీటి ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?
Hyderabad Metro: కాచిగూడ - యశ్వంతపూర్ వందేభారత్ రైలు టికెట్ ఛార్జీలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. క్యాటరింగ్ తో పాటు ఎకానమీ చైర్ కార్ ధరను రూ. 1600గా నిర్ణయించారు.
Vandebharat Train: హైదరాబాద్, బెంగళూరు మధ్య నడవబోయే మరో సరికొత్త వందేభారత్ రైలు టికెట్ ఛార్జీలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ - యశ్వంతపూర్ (20703) స్టేషన్ కు ఎకానమీ ఛైర్ కార్ లో క్యాటరింగ్ ఛార్జీతో కలుపుకొని రూ.1600గా నిర్ణయించారు. క్యాటరింగ్ ఛార్జి లేకుండా సాధారణ ప్రయాణానికి రూ.1,225, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్ లో ప్రయాణానికి క్యాటరింగ్ ఛార్జీతో కలుపుకొని రూ.2,915గా, కేటరింగ్ ఛార్జీ లేకుండా రూ.2,515గా నిర్ధారించారు. యశ్వంతపూర్ నుంచి కాచిగూడ వెళ్లే 20704 రైలుకు మధ్య ధరల్లో స్వల్ప తేడా మాత్రమే ఉంది. ఎకానమీ ఛైర్ కార్ లో కేటరింగ్ ఛార్జీలతో కలిపి రూ.1540, కేటరింగ్ ఛార్జీ లేకుండా రూ.1255, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్ లో కేటరింగ్ ఛార్జీతో కలిపి రూ.2865, కేటరింగ్ ఛార్జీ లేకుండా రూ.2515గా నిర్ణయించారు.
అలాగే ఈ వందేభారత్ రైళ్లో ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో ప్రారంభం అయ్యే వందే భారత్ రైలు మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. కేటరింగ్ ఛార్జీతో కలిపి టికెట్ బుక్ చేసుకున్న వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్ ను రైళ్లోనే అందిస్తారు. కేటరింగ్ రుసుము చెల్లించని వారికి వీటిని ఇవ్వరు. అలాగే ఇంటి నుంచి తెచ్చుకునే భోజనాన్ని రైల్లోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త వందేభారత్ రైలును ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. ఆదివారం సాధారణ ప్రయాణికులను అనుమతించారు. సోమవారం నుంచి సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఆన్ లైన్ లో టికెట్ల బుకింగ్ ను ఐఆర్సీటీసీ ప్రారంభించింది.
𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗮𝘄𝗮𝗶𝘁𝘀 𝘁𝗼 𝘄𝗲𝗹𝗰𝗼𝗺𝗲 𝗶𝘁𝘀 𝟯𝗿𝗱 𝗩𝗮𝗻𝗱𝗲 𝗕𝗵𝗮𝗿𝗮𝘁 𝗘𝘅𝗽𝗿𝗲𝘀𝘀
— G Kishan Reddy (@kishanreddybjp) September 23, 2023
Hon’ble PM Shri @narendramodi Ji will be flagging off the #VandeBharatExpress between Kachiguda - Yaswantpur virtually on;
📆 24th, September 2023
🏁📍 Kachiguda Railway… pic.twitter.com/1VMSMLPEDv
మరోవైపు తాజా రైల్లలో 25 రకాల మార్పులు
తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాల నుంచి ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో సౌకర్యాలను మెరుగు పరిచినట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 25 రకాలు మార్పులు చేపట్టినట్లు స్పష్టం చేసింది. సీట్లలో ఎనిమిదిన్నర గంటల పాటు కూర్చోవాల్సి వస్తుండటంతో అనేక మంది ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా సీట్లు బాగా లేవని చాలా మంది ప్రయాణికులు ఫిర్యాదులు చేశారు. ఈక్మరంలోనే రైల్వేశాఖ అప్రమత్తం అయి.. మార్పులు, చేర్పులు చేస్తోంది. గంటలపాటు ప్రయాణం చేసే ప్రాయాణికులు హాయిగా పడుకునేలా పుష్ బ్యాక్‌ను, సీట్ల మెత్తదనాన్ని పెంచారు. మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌ను, ఫుట్ రెస్ట్‌ను మెరుగుపరిచారు. అలాగే మరుగు దొడ్లలో వెలుతూరు, వాష్ బేసిన్ల లోతును కూడా పెంచారు. ఇవే కాకుండాఏసీ అధికంగా రావడానికి ప్యానెళ్లలో రైల్వేశాఖ మార్పులు చేసింది.
అంతేకాకుండా దివ్యాంగుల వీల్ ఛైర్ కోసం ప్రత్యేక పాయింట్ ను ఏర్పాటు చేసి అక్కడే వారికి సీటు కేటాయించనున్నారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్ తో మాట్లాడేందుకు బోర్డర్ లెస్ ఎమర్జెన్సీ బ్యాక్ యూనిట్ లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్ లో మార్పులు చేస్తారు. కోచ్ లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ను మరింతగా మెరుగుపరుస్తారు. ఎయిర్ టైట్ ప్యాన్సల్స్ లో మార్పులు చేయనున్నారు. ఎమర్జెన్సీ పుష్ బటన్ ను మరింత సులువు చేయనున్నారు. కోచ్ కు కోచ్ కు మధ్య అసెంబ్లీ యూనిట్ డోర్ ప్యానల్స్ ను మరింత పారదర్శకంగా రూపొందిస్తారు. టాయిలెట్లలో లైటింగ్ మెరుగుపరుస్తారు. 1.5 వాట్ల నుంచి 2.5 వాట్ లకు పెంచుతారు. నీటి ప్రవాహం మరింత మెరుగుపడేలా వాటర్ ట్యాప్ ఏరేటర్లు ఏర్పాటు చేస్తారు.