News
News
X

DSC 2008 Batch : హైకోర్టు తీర్పును కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడంలేదు, న్యాయం చేయాలని బండి సంజయ్ కు డీఎస్సీ-2008 అభ్యర్థుల వినతి

DSC 2008 Batch : హైకోర్టు ఆదేశాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని డీఎస్పీ-2008 మెరిట్ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని బండి సంజయ్ కు వినతి పత్రం అందించారు.

FOLLOW US: 
Share:

DSC 2008 Batch : డీఎస్సీ-2008 మెరిట్ అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పిస్తూ నియామకాలు జరపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని డీఎస్సీ-2008 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను డీఎస్సీ-2008 మెరిట్ అభ్యర్థులు కలిశారు.  పలువురు అభ్యర్థులు బీజేపీ కార్యాలయానికి వచ్చి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేసి నియామక ప్రక్రియ చేపట్టినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ-2008 మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలిస్తామని ముఖ్యమంత్రి  2016లో హామీ ఇచ్చారని, 6 ఏళ్లు దాటినా పట్టించుకోవడం లేదన్నారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ డీఎస్సీ-2008 మెరిట్ అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా ఒత్తిడి తెస్తానని చెప్పారు. 

బీజేపీ అధికారంలోకి రాబోతోంది- బండి సంజయ్ 
 
 "తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. రాష్ట్రంలో మహిళలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా? లేదా? అసలు కేంద్ర పథకాల గురించి మహిళలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్షేత్ర స్థాయికి వెళ్లండి. మహిళలను కలవండి. అట్లాగే టీఆర్ఎస్ పాలనలో మహిళలు పడుతున్న ఇబ్బందులతోపాటు వారి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులనూ అడిగి తెలుసుకోండి" అని బండి సంజయ్ కుమార్ మహిళా మోర్చా నేతలను ఆదేశించారు. 

మహిళా మోర్చా నేతలతో భేటీ 

గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా మోర్చ నేతలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్టీ మహిళా విధానాలు, పరిశోధన విభాగం ఇంఛార్జ్ కరుణా గోపాల్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి సహా పలువురు మహిళా నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఇతర పార్టీల  మాదిరిగా నాలుగు గోడల మధ్య ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడం లేదని, ప్రజల్లోకి వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించడంతోపాటు వారు ఏం కోరుకుంటున్నారో అధ్యయనం చేసి మేనిఫెస్టోను రూపొందిస్తున్నామన్నారు.  పాదయాత్రలో ప్రధానంగా ఎదురైన సమస్యలు, ప్రజల సమస్యలు అర్థం చేసుకున్న తరువాతే రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, ఇండ్లు నిర్మిస్తామని, పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని, గ్రామాల్లో నడిచే ప్రతి అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులిస్తోందన్నారు. 

కేంద్రం ఇస్తుంటే కేసీఆర్ ప్రచారం 

అలాగే గ్యాస్ కనెక్షన్లు, రేషన్ బియ్యం, ఎరువుల సబ్సిడీ వంటివన్నీ కేంద్రమే భరిస్తున్నప్పటికీ…కేసీఆర్ తానే చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ విషయంపై ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు చెబుతూ అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలకు గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నో మంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వెంటనే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి బెస్ట్ స్కీంలుంటే అధ్యయనం చేయాలని కోరారు.

Published at : 26 Jan 2023 08:48 PM (IST) Tags: Hyderabad Bandi Sanjay KCR BRS govt DSC 2008

సంబంధిత కథనాలు

Hyderabad News :  నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

Hyderabad News : నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

యాదాద్రిలాగే బాసర కూడా కృష్ణశిలాశోభితం

యాదాద్రిలాగే బాసర కూడా కృష్ణశిలాశోభితం

శాంతిభద్రతల్లోనే కాదు ఆటల్లోనూ తగ్గేదేలే

శాంతిభద్రతల్లోనే కాదు ఆటల్లోనూ తగ్గేదేలే

దమ్ముంటే సిట్‌కు బీజేపీ నేతలు ఆధారాలు ఇవ్వాలి- మంత్రి జగదీశ్‌ రెడ్డి

దమ్ముంటే సిట్‌కు బీజేపీ నేతలు ఆధారాలు ఇవ్వాలి- మంత్రి జగదీశ్‌ రెడ్డి

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం