News
News
X

VH On BRS : బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్, కేసీఆర్ చేస్తుంది డూప్ ఫైట్ - వీహెచ్

VH On BRS : కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత వీహెచ్ స్పందించారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అంటూ కామెంట్స్ చేశారు.

FOLLOW US: 

VH On BRS : కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చసాగుతోంది. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు కేసీఆర్ టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మార్పుచేశారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అయితే బీఆర్ఎస్ పై బీజేపీ ఆచీతూచీ స్పందిస్తుంది. కేంద్ర నాయకత్వం సూచనలతో బీఆర్ఎస్ పై ఘాటైన విమర్శలు చేయడంలేదని తెలుస్తోంది. ఈటల రాజేందర్ మినహా బీజేపీ నేతలు పెద్దగా బీఆర్ఎస్ పై స్పదించలేదు.  తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ బీఆర్ఎస్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. 

వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు 

సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు స్పందించారు. బీఆర్ఎస్  బీజేపీకి బీ టీమ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కేసీఆర్ ఫైట్ డూప్ ఫైట్ మాత్రమే అని ఎద్దేవా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా అని కేసీఆర్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. దేశంలో కేసీఆర్ కు ఏ పార్టీ కూడా సహకరించదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాష్ట్రంలో సంపాదించిన సొమ్మును దేశంలో ఖర్చు చేస్తారన్నారు. దేశం కేసీఆర్ ను పిలుస్తుంది ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బీజేపీకి లాభం చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారని మండిపడ్డారు. తెలంగాణలో రైతులను పట్టించుకోలేదని, రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. 

సోనియా గాంధీని మోసం 

News Reels

"తెలంగాణ ప్రజల సొమ్మును దేశంలో ఇతర రాష్ట్రాల రైతులకు పంచారు. ప్రజల సొమ్ముతో విమానాలు కొంటున్నారు. రాష్ట్రంలో ఏమీ చేయలేని కేసీఆర్, దేశంలో ఏదో చేస్తానంటే ఎవరు నమ్ముతారు. కేసీఆర్ వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసమే జాతీయ పార్టీ. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియాను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది." -వీహెచ్ 

వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!

తెలంగాణ రైతులకు బేడీలు 

 బీజేపీకి లాభం చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారని వీహెచ్ విమర్శించారు. దేశంలో రైతుల గురించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతులకు బేడీలు వేయించారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల రైతులకు పంచుతున్నారన్నారు.  హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నాంపల్లిలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్ డప్పు కొడుతూ, డ్యాన్స్ చేసి సందడి చేశారు.  

Also Read : Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Also Read : ప్రధాని కావాలన్న ఆశతో ప్రజల్ని కేసీఆర్ వంచిస్తున్నారు: విష్ణు వర్దన్ రెడ్డి

Published at : 06 Oct 2022 06:41 PM (IST) Tags: CONGRESS TS News Hyderabad News BRS CM KCR V Hanumantha rao

సంబంధిత కథనాలు

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !

FRO శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత - త్వరలోనే ఇంటి స్థలం, ఉద్యోగం

FRO శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత - త్వరలోనే ఇంటి స్థలం, ఉద్యోగం

Sunitha Laxamarddy: సాంకేతిక రంగంలో రాణించేలా తల్లిదండ్రులు అమ్మాయిలను ప్రోత్సహించాలి- సునీతా లక్ష్మారెడ్డి

Sunitha Laxamarddy:  సాంకేతిక రంగంలో రాణించేలా తల్లిదండ్రులు అమ్మాయిలను ప్రోత్సహించాలి- సునీతా లక్ష్మారెడ్డి

Hyderabad: భయ్యా అంటూ కళ్లలో కారం కొట్టి, డబ్బుతో ఉడాయిస్తారు, హైదరాబాద్‌లో మరో కొత్త గ్యాంగ్ కలకలం

Hyderabad: భయ్యా అంటూ కళ్లలో కారం కొట్టి, డబ్బుతో ఉడాయిస్తారు, హైదరాబాద్‌లో మరో కొత్త గ్యాంగ్ కలకలం

Bandi Sanjay : ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర, రేపు భైంసా శివారులో బహిరంగ సభ!

Bandi Sanjay :  ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర, రేపు భైంసా శివారులో బహిరంగ సభ!

టాప్ స్టోరీస్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Chiranjeevi IFFI Award : ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్న చిరంజీవి | ABP Desam

Chiranjeevi IFFI Award : ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్న చిరంజీవి | ABP Desam