Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
Shekar Movie : హీరో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. నిర్మాత తనకు డబ్బు చెల్లించలేదని ఫైనాన్సర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
Shekar Movie : హీరో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమాను నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలని ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు డబ్బు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు పాటించని కారణంగా సినిమా నిలిపివేయాలని తాజా ఆదేశాలు జారీ చేసింది. జీవిత డైరెక్షన్ లో రాజశేఖర్ హీరోగా శేఖర్ సినిమా నిర్మించారు.
#Shekar pic.twitter.com/JipmYOnh57
— Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022
జీవిత, రాజశేఖర్ కు షాక్
జీవిత, రాజశేఖర్ దంపతులకు భారీ షాక్ తగిలింది. రాజశేఖర్ హీరోగా నటించిన జీవిత దర్శకత్వం వహించిన 'శేఖర్' సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. సిటీ సివిల్ కోర్టు ఆదేశాలతో సినిమా ప్రదర్శన అన్ని థియేటర్లలో ఆగిపోయింది. తనకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఆయనకు డబ్బు డిపాజిట్ చేయాలని కోర్టు గడువు పెట్టింది. అయితే జీవిత దంపతుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో సినిమా ప్రదర్శన ఆపివేయాలని తాజాగా కోర్టు ఆదేశాలు జారీచేసింది. థియేటర్, ఓటీటీ, శాటిలైట్, యూట్యూబ్ ఎలాంటి చోట్ల ప్రసారాలు చేయ్యొద్దని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పుపై రాజశేఖర్ ట్విట్టర్లో స్పందించారు. తన సినిమాను కొందరు కుట్ర ప్రకారం అడ్డుకుంటున్నారని ఆరోపిచారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డామన్నారు. శేఖర్ సినిమా విజయం సాధించిందని, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. దీనిని తట్టుకోలేక తమపై కుట్ర చేస్తు్న్నారని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో ఏం మాట్లాడాలో తనకు అర్థం కావడం లేదన్నారు.
యలయాళ జోసెఫ్ కు రీమేక్
రాజశేఖర్ శేఖర్ సినిమా మలయాళంలో విజయవంతమైన 'జోసెఫ్'కు రీమేక్. ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీవిత-రాజశేఖర్ దంపతులు పెద్ద కుమార్తె శివాని ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. మలయాళ జోసెఫ్ తో పోల్చితే శేఖర్ లో చిన్న చిన్న మార్పులు చేశారు. సీనియర్ హీరో రాజశేఖర్ చాలా కాలం తర్వాత గరుడ వేగ సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్కి కూడా పర్వాలేదు అనిపించుకుంది. మళ్లీ చాలా కాలం గ్యాప్ తర్వాత మలయాళం సినిమా రీమేక్ శేఖర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.