Bandi Sanjay On KCR : గొప్పలు చెప్పుకున్న సీఎం కేసీఆర్ అన్నారం పంప్ హౌస్ ను నిండా ముంచారు - బండి సంజయ్
Bandi Sanjay On KCR : తెలంగాణలో నదులకు నకడ నేర్పిన సీఎం కేసీఆర్ అన్నారం పంప్ హౌస్ ను నీట ముంచారని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వేల కోట్లు వృథా అయ్యాయని మండిపడ్డారు.
Bandi Sanjay On KCR : ఇకనైనా కోతలు బంద్ చేసి ప్రజల గోసను పట్టించుకోండని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నారం పంప్ హౌస్ నీటి మునిగిపోయిందని ఆరోపించారు. అంచనాల వ్యయాన్ని పెంచి వేల కోట్లు దోచుకోవడంలో చూపిన శ్రద్ధ ప్రాజెక్టు నిర్మాణంలో చూపకపోవడం సిగ్గుచేటన్నారు. అపర భగీరథుడు, తెలంగాణలో నదులకు నడక నేర్పినోడు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజినీరింగ్ నిపుణుడిని తానేనని గొప్పలు చెప్పుకున్న సీఎం కేసీఆర్ ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కేసీఆర్ నిర్వాకంవల్ల వేల కోట్ల రూపాయలు వృథా కావడమే కాకుండా మంథని, ధర్మపురి నియోజకవర్గాలు ఈరోజు పూర్తిగా నీటమునిగిపోయాయన్నారు.
#KaleshwaramProject : It's all about the lifting the money and pouring into leaders pocket who becomes billionaire in Telangana.
— Nageshwar Rao (@itsmeKNR) July 14, 2022
Annaram pump house completely submerged in water.@revanth_anumula @KotaNeelima #KCRFailedTelangana pic.twitter.com/nSYXu5KoPW
యాదాద్రి నీటికి కుంగిపోయింది
వందల కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన సిరిసిల్ల, జనగాం జిల్లా కలెక్టరేట్ భవనాలు కూడా నీటి మునిగి, గోడలు నెర్రెలు రావడం దారుణమని బండి సంజయ్ అన్నారు. ప్రపంచంలోనే గొప్ప నిర్మాణమని ప్రచారం చేసుకున్న యాదాద్రి నిర్మాణాలు సైతం నీటికి వంగిపోవడం అత్యంత సిగ్గుచేటన్నారు.
గొప్ప ఇంజినీరింగ్ ఇదేనా?
Also Read : Hyderabad News : హుస్సేన్ సాగర్ లో తప్పిన పెను ప్రమాదం, మధ్యలో ఆగిపోయిన 60 మంది పర్యటకులున్న బోటు!
Also Read : CM KCR Review: వార్ రూంలా మారిన ప్రగతి భవన్.. పొద్దస్తమానం సమీక్షలు!