అన్వేషించండి

Bandi Sanjay : ఒవైసీ చేతిలో సీఎం కేసీఆర్ కీలుబొమ్మ, ఎంఐఎం ఆదేశాలతోనే జాతీయ సమైక్యతా దినం- బండి సంజయ్

Bandi Sanjay : కేంద్ర నిర్ణయంతో దిగొచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారని బండి సంజయ్ అన్నారు. దారుస్సలాం ఆదేశాలను కేసీఆర్ అమలుచేస్తున్నారని విమర్శించారు.

Bandi Sanjay : సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడం బీజేపీ సాధించిన విజయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తరువాతే సీఎం కేసీఆర్ సహా కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యతా రాగాన్ని వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని అనేక ఏళ్లుగా పోరాడుతున్నా ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇన్నాళ్లూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపలేదో? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎంఐఎం మెప్పుకోసం తెలంగాణ విమోచన చరిత్రనే వక్రీకరిస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన తరుణంలో  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.  

కేంద్రం నిర్ణయంతో దిగొచ్చిన కేసీఆర్ 
 
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణ విషయంలో సీఎం కేసీఆర్ అనేకసార్లు మాట మార్చారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి సీఎం రోశయ్యను తిట్టిన కేసీఆర్... తెలంగాణ వచ్చాక మాట మార్చారని విమర్శించారు. తెలంగాణ వచ్చాక విమోచన దినోత్సవాలెందుకు అని కేసీఆరే అన్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని నిర్ణయించగానే దిగొచ్చి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారన్నారు. తెలంగాణ విమోచన చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 

దారుస్సలాం ఆదేశాలతోనే 

"దారుస్సలాం నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే కేసీఆర్ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల జపం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా అదే జపం చేస్తోంది. అన్ని పార్టీలు ఈ విషయంలో ఏకమయ్యాయి. అందుకే కాళోజీ గుర్తుకొస్తున్నారు. స్థానికేతరుడు తప్పు చేస్తే తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొట్టాలి. మనోడు తప్పు చేస్తే ఇక్కడే పాతిపెట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్... ఇప్పుడెండుకు మాట మార్చి దారుస్సలాం చెప్పిన మాటను అమలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాలని చెబుతున్న కేసీఆర్ కు ఆనాడు సర్దార్ పటేల్ ’ఆపరేషన్ పోలో’ ఎందుకు నిర్వహించారో తెలియదా?"- బండి సంజయ్ 

ఆపరేషన్ పోలో అందుకే 

నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టు షోయబుల్లాఖాన్ చేతులు నరికిన వ్యక్తి నిజాం అని బండి సంజయ్ అన్నారు. దాని గురించి అసదుద్దీన్ ఓవైసీ ఏనాడైనా ఒక్క మాట మాట్లాడారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డలను వివస్త్రలు చేసి బతుకమ్మ ఆడిస్తే ఏనాడైనా స్పందించారా? అని నిలదీశారు. బైరాన్ పల్లి, నిర్మల్, పరకాల దురాగతాల గురించి నోరు విప్పరా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం అని ఆరోపించారు. రజకార్ల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పార్టీ ఆదేశాలను టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు పాటిస్తున్నారని ఆరోపించారు.  కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు ఒవైసీ చేతిలో కీలుబొమ్మలా మారాయో తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. ఆనాడు తెలంగాణ ప్రజలు పడుతున్న వెట్టి చాకిరి నుంచి, బానిస బతుకుల నుంచి విమోచనం కలిగించడానికే ఆపరేషన్ పోలో నిర్వహించారన్నారు. 

Also Read : TS Cabinet Decisions : సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినం, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Also Read : Nirmala Sitharaman : హైదరాబాద్ పన్నులు హైదరాబాద్ లోనే ఖర్చుపెడుతున్నారా?, రాజీనామా ఎవరు చేయాలో ప్రజలే డిసైడ్ చేస్తారు - నిర్మలా సీతారామన్

టాప్ హెడ్ లైన్స్

Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget