MP Asaduddin Owaisi : తెలంగాణలో 50 స్థానాల్లో పోటీపై సరైన టైంలో నిర్ణయం, బీజేపీ బీటీం కాంగ్రెస్ ప్రచారం మాత్రమే - అసదుద్దీన్
MP Asaduddin Owaisi : తెలంగాణలో 50 స్థానాల్లో పోటీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ అన్నారు. ఎంఐఎం బీజేపీకి బీటీఎం అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
MP Asaduddin Owaisi : తెలంగాణలో 50 స్థానాల్లో పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉందన్నారు. అక్టోబర్ వరకు సమయం ఉంది కదా...త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మీడియాతో చిట్ చాట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ కంటే అందమైన సెక్రటేరియట్ తెలంగాణ సీఎం కేసీఆర్ కట్టారని కితాబిచ్చారు. కొత్త సెక్రటేరియట్ లో మసీదు నిర్మాణంపై ఆడిగామని, కడుతున్నారన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామన్నారు. తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారని, దేశమంతా ఆ పాలన వస్తే మంచిదే అన్నారు. ఎంఐఎంను బీజేపీ బీటీం అని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ అన్నారు. పార్లమెంట్ లో అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని అడిగితే ప్రధాని మోదీ ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. సెక్రటేరియట్ ఓపినింగ్ అధికారిక కార్యక్రమం కాబట్టి అక్కడికి వెళ్తామన్నారు. పరేడ్ గ్రౌండ్ మీటింగ్ బీఆర్ఎస్ రాజకీయ సమావేశం అని, దాంతో మాకు సంబంధం లేదన్నారు. ఇతర పార్టీలని పిలిస్తే అది వారి ఇష్టం అన్నారు.
కేటీఆర్, హరీశ్ రావుతో అసదుద్దీన్ భేటీ
మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గురువారం భేటీ అయ్యారు. అనంతరం అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. 50 స్థానాల్లో పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ సభలకు మాకు ఆహ్వానం అందడం లేదన్నారు. కొత్త సచివాలయం తాజ్‌మహల్ కన్నా పెద్దగా, సుందరంగా కట్టారన్నారు. కొత్త సచివాలయం హైదరాబాద్‌కు తలమానికం అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవుతున్నాయి. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై మజ్లిస్ పార్టీ గురిపెట్టింది. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎంఐఎం పార్టీ అభ్యర్థి పదవీకాలం ఫిబ్రవరి 29తో ముగుస్తుంది. మరోసారి ఈ స్థానంలో ఎంఐఎం తన అభ్యర్థిని నిలపాలని భావిస్తుంది. దీని కోసం బీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తో అసెంబ్లీలో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ స్థానానికి మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నగరా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, తెలంగాణలో 1 నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ వెలువడనుండగా, నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23 గా ఉంది. మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ ఉండనుంది.