Rahul Tour Highcourt Green Signal : ఓయూలో రాహుల్ మీటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ - 150 మందితో నిర్వహించుకోవచ్చన్న హైకోర్టు
ఓయూలో రాహుల్ గాంధీ సమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. వీసీ రెండు సార్లు దరఖాస్తు చేసుకున్న ఆనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖికి హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. రెండు సార్లు వీసీ అనుమతి నిరాకరించడంతో మరోసారి హైకోర్టులో కాంగ్రెస్ నేతలు పిటిషన్ వేశారు . విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికే రాహుల్ విద్యార్థులతో భేటీ అవుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. గతంలో అనేక మంది రాజకీయ నేతలు ఓయూలో పర్యటించారన్నారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. రాహుల్‌తో ముఖాముఖిలో 150 మంది విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని షరతు పెట్టింది.
పసుపు బోర్డు తెచ్చే వరకూ ఎక్కడికక్కడ అడ్డుకొనుడే - నిజామాబాద్ ఎంపీపై కవిత ఫైర్ !
ఉస్మానియాలో రాహుల్ గాంధీతో సమావేశం పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత కాంగ్రెస్ నేతలు ఓయూ వీసీకి దరఖాస్తు చేసుకున్నారు. రాజకీయపార్టీల సభలు, సమావేశాలను అనుమతివ్వకూడదని గతంలో తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా తాము సమావేశానికి అనుమతి ఇవ్వడం లేదని ఓయూ ( Osmania University ) వీసీ ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆందోళనలు ప్రారంభించారు. ఓ సారి ప్రగతి భవన్ ముట్టడికి ఎన్‌ఎస్‌ఐయు నేతలు ప్రయత్నించడంతో వారిని అరెస్ట్ చేశారు. గాందీ భవన్ నుంచి బుధవారం కూడా ర్యాలీగా ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లాలని జగ్గారెడ్డి ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ఆపే కుట్ర- కేంద్రంపై మంత్రి గంగుల సంచలన ఆరోపణలు
ఓయూలో రాహులల్ గాంధీ టూర్ కి రాజకీయాలతో సంబంధం లేదని కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ టూర్ కి అనుమతివ్వకపోవడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఓయూకి వస్తే తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశ్యంతోనే రాహుల్ ను ఓయూకి రాకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.ఓయూలో టీచర్ ఫ్యాకల్టీ సగానికి సగం పడిపోయిందని ... తెలంగాణ ఉద్యమానికి ఓయూని ఉపయోగించుకొన్న కేసీఆర్ ఆ తర్వాత ఓయూని పట్టించుకోలేదని కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తమతో పాటు టీఆర్ఎస్ నేతలు ఓయూకి వచ్చే సాహాసం చేయగలరా అని కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కేటీఆర్‌ను టార్గెట్ చేసిన నెటిజన్లు ! ఆ వ్యాఖ్యలే కారణమా ?
ఆరు, ఏడు తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆరో తేదీన వరంగల్‌లో రైతు సంఘర్షణ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంచారు., ఉస్మానియాలో విద్యార్థఉలతో సమావేశం తర్వాత గాంధీ భవన్‌లో నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.