(Source: Poll of Polls)
Hath se hath Jodo Yatra: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి ఎర్రబెల్లిపై విచారణ జరిపిస్తా- రేవంత్ రెడ్డి
Hath se hath Jodo Yatra: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని అడ్డం పెట్టుకొని భూములు కాజేసిన ఆయనపై విచారణ జరిపిస్తానన్నారు.
Hath se hath Jodo Yatra: టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే బాథ్ జోడో యాత్రం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విజయవంతంగా ముగిసింది. అయితే ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ధరణి పేరుతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భూదందాలు చేస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో ఓనమాలు కూడా రాని అతను.. రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఆయనకు ఏమైనా తెలుసని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని మోసం చేసి ఎర్రెబెల్లి కోవర్టుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. మంత్రి అక్రమాల నిగ్గు తేలుస్తామని రేవంత్ హెచ్చరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి ఎర్రబెల్లి భూ ఆక్రమణలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని వివరించారు.
పాలకుల 24 గంటల కరెంట్ నాటకంలో రైతులు సమిధలుగా మారుతుంటే వారికి కొంతనైనా తోడ్పడాలనే ఉద్దేశంతో 10వరోజు పాదయాత్రలో ఐనవోలు సబ్ స్టేషన్ ను సందర్శించి అక్కడి సిబ్బందికి రైతులకు విషయంలో విలువైన సూచనలు చేయడం జరిగింది#YatraForChange #HaathSeHaathJodo #Day10YatraForChange #Wardhannapet pic.twitter.com/zjqxie7fLI
— Revanth Reddy (@revanth_anumula) February 16, 2023
పాలకుర్తి నియోజకవర్గంలో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటించిన రేవంత్ రెడ్డి.. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. బుధవాం రోజు దేవరుప్పల నుంచి పాలకుర్తి వరకు 18 కిలోమీటర్ల మేర నడక సాగించిన రేవంత్ రెడ్డి.. ఈరోజు ఐనవోలు, ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు మీదగా వర్ధన్నపేట వరకు యాత్ర కొనసాగించనున్నారు. మార్గమధ్యలో ఆయా గ్రామస్థులను కలుసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పాలకుల 24 గంటల కరెంట్ పరిస్థికి గురించి తెలుసుకునేందుకు ఐనవోలులోని సబ్ స్టేషన్ ను సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు. మార్గమధ్యంలో ఓ ముదిరాజ్ యువకుడు రేవంత్ రెడ్డి కోసం వండి తెచ్చిన భోజనాన్ని తిని తెగ మురిసిపోయారు. ఈ విషయాన్ని తాను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని చెప్పారు.
ఈ ప్రేమ ముందు... ఏ కష్టమైనా బలాదూర్…
— Revanth Reddy (@revanth_anumula) February 16, 2023
పేదవాడు చూపే ప్రేమే నా పోరాటానికి ఆలంబన. ముదిరాజ్ సోదరుడు అభిమానంతో వండి తెచ్చిన ఈ భోజనం “యాత్ర”లో నాకు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.#YatraForChange #HaathSeHaathJodo pic.twitter.com/Az3pffvAQ5
నిన్నటి పాదయాత్రలో రుణమాఫీ చేస్తామని హామీ..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. హాత్ సే హాత్ జోడు టిపిసిసి రేవంత్ రెడ్డి పాదయాత్ర జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం నుండి పాదయాత్రకు జన నీరాజనం పడుతూ రేవంత్ రెడ్డిని మంగళహారతులు ఇచ్చి, వీర తిలకంతో ఆహ్వానం పలికారు. ఈ పాదయాత్ర దేవరుప్పుల ధర్మపురం విసునూరు గ్రామాలలో కల్లుగీత కార్మికులను, గొల్ల కురుమలను కలిశారు. అదేవిధంగా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ గురు సేవాలాల్ మహారాజ్ సీతల్ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకనాడు గ్యాస్ ధర 400 రూపాయలు ఉన్న ఇప్పుడు రూ.1130 పెంచిందని రోజువారి కూలీ సైతం నిత్యావసర వస్తువులకే ధరల కొనుగోలుకి కూలి సరిపోతుందని పలువురు ప్రజలు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ఉన్నప్పుడే ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు సామాన్య ప్రజలను మోసం చేస్తూ.. తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చారని రేవంత్ ఆరోపంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, పేదలకు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గింపు, వంటగ్యాస్ ధర 500 కి ఇవ్వడం, ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయల అందించి ఇండ్ల నిర్మాణాలకు తోడ్పాటు అందించడం, కులవృత్తుల వారికి తోడ్పాటు అందించడం, గిరిజనుల ఆరాధ్య దైవం అయిన సేవాలాల్ జయంతి వేడుకలకు ప్రభుత్వం చేయూతను అందిస్తుందని హామీ ఇచ్చారు.