Harish Balakrishna : హరీష్ రావు, బాలకృష్ణ పరస్పర పొగడ్తలు - ఇది రాజకీయం కాదు !
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వార్షికోత్సవానికి హరీష్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు... బాలకృష్ణ, హరీష్ రావు ప్రశంసలు కురిపించుకున్నారు.
Harish Balakrishna : బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ కట్టాల్సిన రూ. అరు కోట్ల రూపాయల పన్నును రద్దు చేసినందున ఆ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదర్శమైన నాయకుడు హరీష్ రావు అన్నారు. ఒక్కసారి వెళ్లి కలిస్తేనే.. ఆరు కోట్ల రూపాయిలను మాఫీ చేశారని అభినందించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ 22వ వార్షికోత్సవ వేడుకలకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీషరావు ముఖ్య అతిథిగా హజరయ్యారు.
హరీష్ రావు జన నాయకుడన్న బాలకృష్ణ
తల్లి బసవతారకం కోరిక మేరకు పేదలకు క్యాన్సర్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా ఆస్పత్రి ప్రారంభించామని బాలకృష్ణ తెలిపారు. ఎంతోమంది దాతలు హాస్పిటల్ కు సాయం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆర్థికంగా ఆదుకున్న వారికి వందనాలు అని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు… ప్రజల మనిషి అని ఆయన కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ కింద పేషెంట్ లను ట్రీట్ చేస్తున్న హాస్పిటల్స్ లలో సెకండ్ ప్లేస్ ఉన్నామని బాలకృష్ణ తెలిపారు. నందమూరి బాలకృష్ణ నటుడిగా, హిందూపురం ఎమ్మెల్యేగానే కాకుండా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయ్యన్న గోడ కట్టుకోవచ్చు - పర్మిషన్ ఇచ్చిన హైకోర్టు !
అన్ని రంగాల్లోనూ బాలకృష్ణ రాణిస్తున్నారన్న హరీష్ రావు
హరీష్ రావు కూడా బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తారు. ఎవరు అయిన ఒక రంగంలో రణిస్తేనే గొప్పగా చెపుతాం, కానీ సేవారంగం, సినిమా రంగం, రాజకీయ రంగం ఇలా అన్నిటిలో రాణిస్తూ, తండ్రి ఎన్టీఆర్ ఆశయాలును ముందుకు తీసుకువెళ్తున్న నిత్య కృషివలుడు నందమూరి బాలకృష్ణ అని హరీష్ రావు ప్రశంసించారు.
రాజోలు వైఎస్ఆర్‌సీపీలో జనసేన ఎమ్మెల్యే చిచ్చు - వాళ్లంతా పార్టీకి గుడ్ బై !
22 ఏళ్లు పూర్తి చేసుకున్న బసవతారకం ఆస్పత్రి
నందమూరి తారక రామారావు క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్‌ను 1988లో స్థాపించారు. ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్(IACO) యుఎస్ఎ వారి సహకారంతో బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇండియా.. 22 జూన్ 2000న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించింది. అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి గారు ఈ హాస్పిటల్‌ను ప్రారంభించారు. క్యాన్సర్ వైద్యంలో ఉత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఈ హాస్పిటల్ పేదలకు సేవలు అందిస్తోంది.