Razole YSRCP : రాజోలు వైఎస్ఆర్‌సీపీలో జనసేన ఎమ్మెల్యే చిచ్చు - వాళ్లంతా పార్టీకి గుడ్ బై !
రాజోలు వైఎస్ఆర్‌సీపీలో వరుసగా నేతలు రాజీనామాలు చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే పార్టీలోకి రావడంతోనే ఈ చిచ్చు రేగింది.
Razole YSRCP : ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో అసంతృప్తి సెగలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య పొసగక మీడియాకు ఎక్కుతున్నారు. ఇలాంటి సమయంలో రాజోలు నియోజకవర్గంలో కీలక నేత ఒకరు అంతర్గత రాజకీయాల కారణంగా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్‌సీపీలో కలకలం ప్రారంభయింది.
మంత్రి కేటీఆర్ కంటే నేను చాలా సీనియర్ - మాజీ ఎమ్మెల్యే తాటి అల్టిమేటం, కారణం అదేనా ?
జనసేన ఎమ్మెల్యే వైఎస్ఆర్‌సీపీలో చేరడంతో చిచ్చు
రాజోలులో గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన జనసేన పార్టీని కాదని వైఎస్ఆర్‌సీపికి మద్దతు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనే నియోజకవర్గం బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే పార్టీలో చాలా కాలం నుంచి ఇతర నేతలు ఈ కారమంగా అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో పార్టీ కోసం కష్టపడిన తమకు కాకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజోలుకు చెందిన వైఎస్ఆర్‌సీపీరాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజు రాజీనామా చేశారు.
పోటీ లేని ఆత్మకూరులోనూ సర్వశక్తులు ఒడ్డుతున్న వైఎస్ఆర్‌సీపీ ! మెజార్టీ కోసమేనా ?
జనసేన ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతల ఆగ్రహం
కేవలం పార్టీ పదవినే కాకుండా.. ఆ పార్టీలోని ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అతనితోపాటు అతని అనుచరులు కూడా పార్టీకి దూరమయ్యారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి పంపించారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఇప్పటి వరకు కష్టపడి పని చేసినా.. కొత్తవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రుద్రరాజు పేర్కొన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చిన రాపాకను నియోజకవర్గ ఇన్చార్జిగా అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.
డీహెచ్ శ్రీనివాస్ ఆశలు గల్లంతైనట్లేనా? అందుకే కొత్తగూడెంలో దూకుడు తగ్గిందా?
ఇంచార్జ్‌గా రాపాక వద్దని డిమాండ్
వైఎస్సార్సీపీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాగి రామరాజుతోపాటు నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జి సుందరపు బుల్లబ్బాయి తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా రాష్ట్ర కార్యదర్శి కూడా రాజీనామా చేశారు. దీంతో వైఎస్సార్సీపీకి తీవ్ర షాక్ తగిలింది.రాజోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి మూడు ముక్కలాటగా మారిందన్న నిట్టూర్పులు ఆ పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నాయి.