అన్వేషించండి

Telangana News: మొదటి దశలో 10 వేల మందికి మైనార్టీ బంధు - చెక్కులిచ్చే తేదీ ఖరారు !

మైనార్టీ బంధు పథకాన్ని ప్రారంభించే తేదీని హరీష్ రావు ప్రకటించారు.


Telangana News: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ బంధు పేరుతో  మైనార్టీలకు రూ. లక్ష ఇచ్చే పథకాన్ని ఇటీవల ప్రకటించింది. అప్పుడే అమలు చేసేందుకు తేదీని ఖరారు చేసింది. ఈనెల పదహారో తేదీ నుండే చెక్కుల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.  మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు. వీరందరికీ 16 నుండి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ  చేస్తారు.  అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన‌ హామీ మేరకు మైనార్టీల స‌మస్యలపై  ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు సమీక్ష నిర్వహించారు.  మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్ సీస్ స్కాలర్ షిప్స్, స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్ స్మశాన వాటికలు, ఆర్టీఎఫ్‌, ఎంటీఎఫ్ తదితర అంశాలపై చర్చించారు.                        
 
రాష్ట్రంలోని ఇతర వర్గాలతో సమానంగా మైనారిటీ వర్గాల సంక్షేమంతోపాటు అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని హరీష్ రావు స్పష్టం చేశారు.  స్మశాన వాటికలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు-మౌజ‌మ్‌ల‌ సంఖ్య పెంపు వంటి రెండు హామీలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ఇప్పటికే కేటాయించిన రూ. 270 కోట్లకు అదనంగా, మరో రూ. 130 కోట్లు కేటాయించి మొత్తం రూ. 400 కోట్లు ఈ కార్యక్రమం అమలుకు కేటాయించామని మంత్రి ప్రకటించారు.                         

ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం రూ. ల‌క్ష‌ ఆర్థిక సహాయం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.  మైనారిటీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై మరింత దృష్టి సారించనన్నారు.   ఒవైసీ పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ పనులు, దర్గా బర్హనా షా అద్దెల సవరణ, క్రిస్టియన్ స్మశాన వాటికలు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర పనులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హరీష్ రావు తెలిపారు.  పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి పనులు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని అధికారులను కోరారు. షాదీ ముబారక్‌కు సంబంధించి, ప్రక్రియను వేగవంతం చేసి, లబ్ధిదారులకు వెంటనే ఉపశమన సొమ్ము అందేలా చూస్తామన్నారు.                                 

ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెలలోనే వస్తుందని బీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. అందుకే.. కేసీార్ ప్రకటించిన పథకాలన్నింటినీ వీలైనంత త్వరగా ప్రారంభించాలని అనుకుంటున్నారు. పథకం ప్రకటన చేసిన మూడు వారాల్లోనే అమలును ప్రారంభించేస్తున్నారు. ఇప్పటికే బీసీ బంధును ప్రారంభించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా లబ్దిదారుల ఖాతాల్లో నగదు పడేలా .. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. 

టాప్ హెడ్ లైన్స్

IPS Uday Krishna Reddy Suicide Note: మేం రిలేషన్ షిప్‌లో ఉన్నాం - అన్నీ తప్పుడు ఆరోపణలే - ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌లో సంచలన విషయాలు
మేం రిలేషన్ షిప్‌లో ఉన్నాం - అన్నీ తప్పుడు ఆరోపణలే - ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌లో సంచలన విషయాలు
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget