TS Governament Vs Governer : తెలంగాణ సర్కార్‌పై గవర్నర్‌దే పైచేయి - హైకోర్టులో ఏం జరిగిందంటే ?
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌దే పైచేయి అయింది. గవర్నర్‌పై హైకోర్టుకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం చివరికి పిటిషన్ విత్ డ్రా చేసుకుని..అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రకటించాల్సి వచ్చింది.

TS Governament Vs Governer : గవర్నర్ బడ్జెట్‌ను ఆమోదించడం లేదని హైకోర్టులో ప్రభుత్వ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం కొంత సేపు వాదనల తర్వాత వెనక్కి తీసుకుంటున్నట్లుగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు లాయర్ దుష్యంత దవే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం సంచలనంగా మారింది.
రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు కలగజేసుకోవచ్చునని ప్రభుత్వం తరపు లాయర్ దుష్యంత్ దవే వాదించారు. 1974 లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు ను ప్రస్తావించిన దవే ప్రస్తావించారు. ఆర్టికల్ 174, 153 ప్రకారం గవర్నర్ విధులను ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉంటుందన్నారు. బడ్జెట్ ఆమోదం విషయంపై ఆర్థిక శాఖ కార్యదర్శి గవర్నర్ ను సంప్రదించారని.. అసెంబ్లీలో తన ప్రసంగం ఉందా అని గవర్నర్ అడిగారన్నారు. కోర్ట్ కు రావడం ... గవర్నర్ పైనే పిటిషన్ దాఖలు చేయటం తమ ఉద్దేశం కాదని దవే స్పష్టం చేసారు. తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి విషయాల్లో మేము కలగజేసుకుంటే కోర్టు పరిధి దాటి వ్యవహరిస్తుందని మీరే అంటారని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. చివరికి గవర్నర్ ప్రసంగం ఉంటుందని దవే కోర్టుకు తెలిపారు.
ఉదయం బడ్జెట్ కు గవర్నర్ తమిళి సై అనుమతి తెలపకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ కు అనుమతించాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ‘లంచ్ మోషన్’ మెన్షన్ చేసిన సందర్భంలో న్యాయస్థానం కీలక వాఖ్య చేసింది. ‘ఇందులో న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుంది’ అని వ్యాఖ్యానించింది. లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతిస్తే తాము పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరించారు. దీంతో హైకోర్టు లంచ్ మోషన్ ను అనుమతించింది. మధ్యాహ్నం వాహనలు జరిగాయి. అయితే వాదనలు ప్రారంభమైన తర్వతా రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్వంత్ దవే పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లుగా తెలిపారు.గవర్నర్ ప్రసంగం కూడా అసెంబ్లీలో ఉంటుందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒక్క సారి ప్రభుత్వం గవర్నర్ విషయంలో వెనక్కి తగ్గినట్లయింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి మూడో తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకుత ప్రారంభించాలని నిర్ణయించారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలకు ముందు ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. కానీ తెలంగాణ సర్కార్ కు.. గవర్నర్ కు మధ్య విబేధాలు ఉండటంతో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో కొత్త సమావేశాలు కాదని.. పాత సమావేశాలకు కొనసాగింపేనని చెబుతూ.. శాసనసభ 8వ సెషన్ 4వ విడత సమావేశాలంటూ ప్రకటన చేశారు. గతేడాది సెప్టెంబర్లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. అయితే అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు. దీంతో గత సమావేశాలకు కొనసాగింపుగానే.. ఫిబ్రవరి సెషన్స్ కొనసాగుతాయని ప్రకటించారు.
అయితే బడ్జెట్‌కు రాజ్యాంగపరంగా గవర్నర్ ఆమోదం తప్పని సరి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి రాజ్ భవన్‌కు బడ్జెట్ వెళ్లింది. కానీ బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించలేదు.కానీ అసెంబ్లీ సంయుక్త సమావేశం ఎందుకు లేదు ? గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదు ? అని ప్రశ్నిస్తూ ఓ లేఖను తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ పంపారు. ఈ కారణంగానే గవర్నర్ బడ్జెట్ ఆమోదించేలా ఆదేశించాలని తెలంగాణ సర్కార్ హైకోర్టుకు వెళ్లింది. అంతిమంగా తమ వాదన రాజ్యాంగ పరంగా నిలబడదని అనుకున్నారేమో కానీ.. చివరికి గవర్నర్ విషయంో పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

