News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Telangana News : హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి - స్వాగతం చెప్పిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ !

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్, సీఎం స్వాగతం పలికారు. స్వాగత కార్యక్రమంలో గవర్నర్, సీఎం మాట్లాడుకోలేదు.

FOLLOW US: 
Share:

Telangana News :   భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము   హైదరాబాద్‌కు వచ్చారు.  రాష్ట్ర‌ప‌తికి  గవర్నర్ తమిళిసై,  ముఖ్య‌మంత్రి కేసీఆర్ , కేంద్రమంత్రి కిషన్  రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు.  సీఎంతో పాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జీహెచ్ఎంసీ మేయ‌ర్  కూడా స్వాగతం పలికిన వారిలో ున్నారు.  ద్రౌప‌ది ముర్ము విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.  రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు రీవ్యూయింగ్‌ ఆఫీసర్‌గా హాజరవుతారు. పరేడ్‌ అనంతరం తిరిగి ఢిల్లీకి వెళతారు.                                

రాష్ట్రపతి  హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో ప్రోటోకాల్ ప్రకారం... మొదట గవర్నర్, తర్వాత ముఖ్యమంత్రి స్వాగతం చెప్పాల్సి ఉంటంది. ఈ కారణంగా గవర్నర్, సీఎం కేసీఆర్ ముందుగానే బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు. పలకరించుకోలేదని తెలుస్తోంది. రాష్ట్రపతి విమానం ల్యాండ్ అయిన తర్వాత  .. స్వాగతం చెప్పేందుకు అందరూ వేచి ఉన్న సమయంలో పక్కనే ఉన్న కిషన్ రెడ్డితో..కేసీఆర్ మాట్లాడారు కానీ.. తమిళిశైతో మాట్లాడలేదని.. తెలుస్తోంది. గవర్నర్ తో సీఎం కేసీఆర్‌కు విచ్చిన విబేధాలు సమసిపోలేదని.. భావిస్తున్నారు.                                                                            

రాష్ట్రపతి ఎన్నికల సమయంలో .. ద్రౌపతి ముర్ముకు.. కేసీఆర్ మద్దతు  ప్రకటించలేదు. బీఆర్ఎస్ పార్టీ ఓట్లేమీ ముర్ముకు పడలేదు. అయితే రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రంకేసీఆర్ ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు ఎప్పుడు వచ్చినా.. కేసీఆర్ స్వాగతం చెప్పడం లేదు. సీనియర్ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బాధ్యతలిస్తున్నారు. రాష్ట్రపతి ముర్ముకు .. రాజకీయాలతో సంబంధం ఉండదు కాబట్టి.. ఆమెకు కేసీఆర్ స్వాగతం పలుకుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.                                                                                               

ప్రభుత్వం విషయంలో గవర్నర్ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ భావిస్తోంది. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన విద్యార్థఉల ఆత్మహత్యలపైనా నివేదిక అడిగారు.                          
               
దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ - అన్ని పార్టీలూ ఆలోచించాలన్న తెలంగాణ బీజేపీ నేత !

Published at : 16 Jun 2023 06:44 PM (IST) Tags: Governor Tamilisai Draupadi Murmu President President's visit CM KCR in Hyderabad

ఇవి కూడా చూడండి

Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్‌ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్

Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్‌ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్

Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్​రెడ్డి ఎద్దేవా

Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్​రెడ్డి ఎద్దేవా

Indrakaran Reddy: రూ.75 కోట్లతో నిర్మించనున్న అంతర్రాష్ట్ర వంతెనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ

Indrakaran Reddy: రూ.75 కోట్లతో నిర్మించనున్న అంతర్రాష్ట్ర వంతెనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ

Rainbow Hospitals: గుండె లోపాలు జయించిన చిన్నారులతో రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ హార్ట్ డే వేడుకలు

Rainbow Hospitals: గుండె లోపాలు జయించిన చిన్నారులతో రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ హార్ట్ డే వేడుకలు

Telangana Investments : తెలంగాణలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ భారీ పెట్టుబడులు - కేటీఆర్‌తో సమావేశమైన కంపెనీ ప్రతినిధులు !

Telangana Investments : తెలంగాణలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ భారీ పెట్టుబడులు -  కేటీఆర్‌తో సమావేశమైన  కంపెనీ ప్రతినిధులు !

టాప్ స్టోరీస్

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?