Loan waiver: రైతులకు గుడ్ న్యూస్, రూ.లక్షపైన రుణాలు కూడా మాఫీ, మంత్రి హరీశ్ రావు వెల్లడి
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.99,999 లోపు రుణాలను మాఫీ చేశామని.. రూ.1లక్షకి పైగా ఉన్న రుణాలను మాఫీ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
తెలంగాణలో రైతు రుణమాఫీపై మంత్రి హరీశ్ రావు కీలక శనివారం (ఆగస్టు 19) కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.99,999 లోపు రుణాలను మాఫీ చేశామని.. రూ.1లక్షకి పైగా ఉన్న రుణాలను మాఫీ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. బ్యాంకు ఖాతా పని చేయకుంటే వారి అకౌంట్ ఆపరేషన్ లైజ్ చేసి మాఫీ జరిగేలా చేస్తామని హరీశ్ రావు హామీ చెప్పారు.
శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30లక్షల కుటుంబాలకు రుణమాఫీ జరిగిందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారమే రైతులకు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ప్రతీ రైతుకు రుణమాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని.. ఆయన ఆదేశిస్తే ఆచరిస్తామన్నారు. మైనార్టీలకు రూ.లక్ష చెక్కులు పంపిణీ చేశామన్నారు మంత్రి హరీశ్ రావు.
హెల్త్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య పెంపు..
తెలంగాణలో భర్తీ చేయనున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ఇటీవల 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. మరో 146 పోస్టులను నోటిఫై చేసినట్టు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. కొత్త ఉద్యోగాలతో కలిపి భర్తీ చేసే మొత్తం పోస్టుల సంఖ్య 1,666కి పెరిగిందన్నారు. అలాగే, అభ్యర్థుల వయో పరిమితిని 44 నుంచి 49కి పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిపారు. సర్వీస్ వెయిటేజీ కింద ఇచ్చే మార్కులను సైతం 20 నుంచి 30 మార్కులకు పెంచుతున్నట్టు హరీశ్ రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయనున్నాయన్నారు. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25 ఉదయం 10.30గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభంకానుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 19న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
రెండేళ్లలో ఏఐ కేంద్రంగా తెలంగాణ- ప్రభుత్వం రిపోర్టులో ఆసక్తికరమైన అంశాలు
ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా టెక్నాలజీ పరంగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చదువుతో, టక్నాలజీతో సంబంధం లేకుండా అందరూ చెబుతున్న పదం ఏఐ. అందుకే ప్రభుత్వాలు సైతం దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నాయి. ప్రత్యేకంగా ఓ కరికులమ్ రూపొందించేందుకు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా టెక్నాలజీ పరంగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చదువుతో, టక్నాలజీతో సంబంధం లేకుండా అందరూ చెబుతున్న పదం ఏఐ. అందుకే ప్రభుత్వాలు సైతం దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నాయి. ప్రత్యేకంగా ఓ కరికులమ్ రూపొందించేందుకు ఏర్పాటు చేస్తున్నాయి. మరో రెండేళ్లలో ఏఐ ఆధారంగా చేసుకొని లక్షన్నర ఉద్యోగాలు రాబోతున్నాయని అంచనా వేసిందీ రిపోర్టు. ఇది ఇంకా పెరగబోతోందని కూడా చెప్పుకొచ్చింది. అందుకే ఆ మార్పులకు అనుగుణంగా యువతను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏఐ ఆధారిత కోర్సులపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు చెబుతోంది. లక్ష మందిని మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తయారు చేయబోతున్నట్టు వెల్లడించింది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..