By: ABP Desam | Updated at : 19 Aug 2023 11:53 PM (IST)
Edited By: omeprakash
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు
➥ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 146 పోస్టులు
➥ వైద్యవిధాన పరిషత్‌లో 265 పోస్టులు జోడింపు
➥ 1931కి చేరిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 'మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్' పోస్టుల భర్తీకి జులై 26న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఈ పోస్టులున్నాయి. అయితే ప్రస్తుత పోస్టులకు అదనంగా 146 పోస్టులను చేర్చారు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 1666కి చేరినట్లయింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆగస్టు 19న ఒక ప్రకటనలో తెలిపారు.
వయోపరిమితి పెంపు..
పోస్టుల సంఖ్యతోపాటు అభ్యర్థుల వయోపరిమితిని కూడా ప్రభుత్వం పెంచింది. అభ్యర్థుల వయసును 44 నుంచి 49కి పెంచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు మంత్రి హరీశ్‌వారు తెలిపారు. సర్వీస్ వెయిటేజీ కింద ఇచ్చే మార్కులను సైతం 20 నుంచి 30 మార్కులకు పెంచుతున్నట్టు హరీశ్ రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయనున్నాయన్నారు. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25 ఉదయం 10.30గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 19 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వైద్యవిధాన పరిషత్‌లో 265 పోస్టులు..
కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ 146 పోస్టులను అదనంగా చేర్చడంతోపాటు, వైద్యవిధాన పరిషత్‌లో 265 పోస్టులను జతచేసింది. దీంతో 1666 పోస్టులకు అదనంగా 265 పోస్టుల చేరండంతో మొత్తం ఖాళీల సంఖ్య 1931కి చేరింది.
Good news for aspiring Multi Purpose Health Assistants - MPAH(F)s !
— Harish Rao Thanneeru (@BRSHarish) August 19, 2023
Hon’ble CM Shri KCR garu directed to increase Age limit from 44 to 49.
Vacancies increased from 1,520 to 1,666. Service weightage increased from 20 marks to 30 marks for MPHA (F) recruitment through MHSRB.… pic.twitter.com/cIgn504CUu
మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు, మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. (లేదా) ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ & తెలంగాణ రాష్ట్ర ఎక్స్-సర్వీసెమెన్ ఉద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు: 1520
* మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫిమేల్) పోస్టులు
అర్హత: మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు మరియు మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణను పూర్తి చేసి ఉండాలి. (లేదా) గుర్తింపు పొందిన ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణను పూర్తి చేసుకొని ఉండాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకొని ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 44 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.500. ప్రాసెసింగ్ ఫీజు-రూ.200; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ & తెలంగాణ రాష్ట్ర ఎక్స్-సర్వీసెమెన్ ఉద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: పరీక్ష ఓఎంఆర్ ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పరీక్ష ఆంగ్లంలో జరుగుతుంది.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.
పే స్కేల్: రూ.31,040 – 92,050 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 25.08.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.09.2023.
Notification:
ALSO READ:
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 63 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
BEL Recruitment: బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 63 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, బీకామ్, బీబీఎం, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
CISF Fireman Answer Key: సీఐఎస్‌ఎఫ్ కానిసేబుల్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం
వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు
PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ 'టైర్-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక
VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!
KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !
TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ చూశారా?
/body>