(Source: ECI/ABP News/ABP Majha)
Hetero Tiger : హెటెరో ఫ్యాక్టరీలో చిరుత - అటవీ అధికారులతో గేమ్స్ ! ఇదైనా చిక్కుతుందా ?
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం హెటెరో పరిశ్రమలోకి చిరుత చొరబడింది. పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Hetero Tiger : ఆ ఫ్యాక్టరీలో తెల్లవారుజామునే షిప్ట్ లో కార్మికుల కన్నా ముందే చిరుత వచ్చింది. ఇక కార్మికులు ఎవరూ వెళ్లలేకపోయారు. ఇప్పుడా ఆ చిరుతను .. ఫ్యాక్టరీ నుంచి పంపించేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో జరిగింది. హెటిరో పరిశ్రమలో చిరుత సంచరిస్తున్నట్లుగా సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో కలకలం ప్రారంభమయ్యాయి.
హెటెరో ఫ్యాక్టరీ హెచ్ బ్లాక్ లో తెల్లవారుజామున సీసీ కెమెరాలో రికార్డయిన చిరుత దృశ్యాలు
హెటెరో ఫ్యాక్టరీ హెచ్ బ్లాక్ లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిరుత తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. గత మూడు నెలల క్రితం కూడా సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాకు లభ్యమయ్యాయి. దీంతో అక్కడే ఉందని నిర్ధారించుకున్న ఫ్యాక్టరీ అధికారులు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమయిన అటవీ శాఖ సిబ్బంది.. 45 మంది అటవీ శాఖ జు అధికారులతో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. జూ నుండి రెండు బోన్లు తీసుకు వచ్చారు. రెండు బోన్లు లలో రెండు మేక పిల్లలను ఎరగా వేసి పులిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కనిపిస్తే మత్తు ఇంజక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పులి కనిపించీ కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతూండటంతో అటీవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. .
నాలుగు బోన్లతో అటవీ అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలు
చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పులుల కంటే చిరుతలు ఎంతో చెలాకీగా ఉంటాయి. అందువల్ల వాటిని పట్టుకోవడం అంత తేలిక కాదు.హెటెరో పరిశ్రమకు దగ్గర్లోనే అడవులున్నాయి. అందువల్ల చిరుత పులి అడవి నుంచి ఇలా వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అది ఎప్పటికి చిక్కుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. పరిశ్రమలో కి ప్రస్తుతం కార్మికులను అనుమతించడం లేదు. ఉత్పత్తిని ఆపేశారు. చిరుతను పట్టుకున్న తర్వాతనే కార్మికులను లోపలికి అనుమతించే అవకాశం ఉంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కనిపించకుండా హంగామా చేస్తున్న పులులు
ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరుతలు, పులుల సంచారం కలకలం రేపుతోంది. చాలా చోట్ల పులులు కనిపిస్తున్నాయి. బయట దాడులు చేస్తున్నాయి. పసుశులను చంపుతున్నాయి. అయితే.. చిక్కడం లేదు. తప్పించుకుని వెళ్తున్నాయి. ఏపీతో పాటు ఇటీవల ఆదిలాబాద్ అడవుల్లోనూ ఇలా పులుల సంచారం ఎక్కువగా ఉంది. వాటిని పట్టుకునే ప్రయత్నాలు ఫెయిలవుతున్నాయి. ఇప్పుడు హెటెరో చొరబడిన చిరుత చిక్కుతుందా.. లేకపోతే.. వచ్చిన దారినే ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఒక వేల చిరుత చిక్కకపోతే.. కార్మికులు టెన్షన్‌తో పని చేయాల్సిందే. ఎందుకంటే.. మూడు నెలల కిందట కూడా ఓ సారి ఆ చిరుత కనిపించింది.అంటే.. అక్కడే ఎక్కడో నక్కి ఉంటుందని వారి భయం.
కరీంనగర్ బీఆర్ఎస్‌లో ఐక్యతారాగం - కలసిపోయిన మంత్రి గంగుల, సర్దార్ రవీందర్ సింగ్ !