అన్వేషించండి

Deve Gowda On BRS: కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్‌ విజయం సాధించాలి - మాజీ ప్రధాని దేవేగౌడ

తెలంగాణ ఉద్య‌మంతో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మాజీ ప్ర‌ధాన‌మంత్రి, జన‌తాద‌ళ్ (ఎస్‌) అధినేత హెచ్ డీ దేవేగౌడ. బీఆర్ఎస్‌, కేఆర్‌టీఏ ఆకాంక్ష‌లు స‌ఫ‌లికృతం కావాల‌ని ఆకాంక్షించారు. 

- సందీప్ మ‌ఖ్త‌ల నాయ‌క‌త్వంలోని బృందంతో దాదాపు గంట‌పాటు చ‌ర్చ‌లు
- ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోయినా సంభాషించిన జేడీ (ఎస్‌) ర‌థ‌సార‌థి
- తెలంగాణ ఉద్య‌మంతో త‌న అనుబంధం నెమ‌రువేసుకున్న దేవేగౌడ‌
- బీఆర్ఎస్‌, కేఆర్‌టీఏకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ప్రధాని

బెంగ‌ళూరు: దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా బీఆర్ఎస్ ఏర్పాటును ప్ర‌క‌టించిన తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి, క‌ర్ణాట‌క రాష్ట్ర తెలంగాణ అసోసియేష‌న్ నిర్ణ‌యం ప‌ట్ల‌ మాజీ ప్ర‌ధాన‌మంత్రి, జన‌తాద‌ళ్ (ఎస్‌) అధినేత హెచ్ డీ దేవేగౌడ సంతోషం వ్య‌క్తం చేశారు. కేఆర్‌టీఏ వ్య‌వ‌స్థాప‌కులు మ‌రియు అధ్య‌క్షుడు సందీప్ మ‌ఖ్త‌ల,  సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఈవీ స‌తీష్ మ‌రియు కేఆర్టీఆఏ బృందాన్ని త‌మ నివాసానికి ఆహ్వానించిన దేవేగౌడ‌, ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోయినా దాదాపు గంట‌పాటు వారితో సంభాషించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్య‌మంతో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్‌, కేఆర్‌టీఏ ఆకాంక్ష‌లు స‌ఫ‌లికృతం కావాల‌ని ఆకాంక్షించారు. 

కర్ణాటకలో తెలంగాణభ‌వ‌న్ ఏర్పాటుకు యత్నాలు 
తెలంగాణ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు అధికంగా నివ‌సిస్తున్న క‌ర్ణాట‌కలో వారికి ఒక వేదిక‌గా ఉండ‌టం, క‌ర్ణాట‌క‌లో పంప‌ణ తెలంగాణ భ‌వ‌న్ ఏర్పాటుకు కృషి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా  క‌న్న‌డ రాష్ట్ర తెలంగాణ అసోసియేష‌న్ (కేఆర్‌టీఏ)ను 2012లో సందీప్ కుమార్ మ‌ఖ్త‌ల ఏర్పాటు చేశారు. తెలంగాణ పండుగ‌లైన బ‌తుక‌మ్మ‌, బోనాలు, అల‌య్‌- బ‌ల‌య్‌ల‌ను ఏటా నిర్వ‌హిస్తూ బెంగ‌ళూరులోని తెలంగాణవాసులు, సీమాంధ్రకు చెందిన వారి ప‌క్షాన మ‌న సంస్కృతి, ప్ర‌త్యేక‌త‌ల‌ను చాటి చెప్తున్నారు. 2017లో ఆనాటి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌త్న‌ప్ర‌భ‌ను క‌లిసి బెంగ‌ళూరులో పంప‌ణ తెలంగాణభ‌వ‌న్ ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తూ విన‌తిప‌త్రం అంద‌జేశారు. 
2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో, అప్ప‌టి ముఖ్య‌మంత్రి మ‌రియు కాంగ్రెస్ ముఖ్య నేత సిద్ధ‌రామ‌య్య‌, జేడీ (ఎస్‌) అధినేత, మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌, బీజేపీకి చెందిన మాజీ ముఖ్య‌మంత్రి, కీల‌క‌నేత‌ య‌డ్యూర‌ప్పన‌ు క‌లిసి పంప‌న తెలంగాణ భ‌వ‌న్ ప్రాధాన్య‌త‌ను తెలిపి మేనిఫెస్టోలో పొందుప‌ర్చాల‌ని కోరారు. జేడీ (ఎస్‌) త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఈ మేర‌కు భ‌వ‌నం ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ఎన్నికల అనంత‌రం జేడీ (ఎస్‌) అధికారంలోకి రాగానే ఎక‌రం స్థ‌లం కేటాయించే ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టి ఈ మేరకు అనుమ‌తి ప‌త్రం కేఆర్‌టీఏకు అంద‌జేసింది. తాజాగా బీఆర్ఎస్ రూపంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ చేయగా, దానికి కేఆర్‌టీఏ మ‌ద్ద‌తు తెలిపింది. 

Deve Gowda On BRS: కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్‌ విజయం సాధించాలి - మాజీ ప్రధాని దేవేగౌడ
తెలంగాణ ఉద్యమంతో దేవేగౌడకు అనుబంధం
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నిర్ణ‌యానికి జేడీ (ఎస్‌) ఆది నుంచి అండ‌గా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. కేఆర్‌టీఏ సంఘీభావం నేప‌థ్యంలో కేఆర్‌టీఏ అధ్య‌క్షుడు సందీప్ మ‌ఖ్త‌ల, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఈవీ స‌తీష్ నాయ‌క‌త్వంలోని బృందాన్ని దేవేగౌడ త‌మ నివాసానికి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్య‌మంతో త‌న అనుబంధం నెమ‌రువేసుకున్న దేవేగౌడ, ఉద్యమ సమయంలో సందీప్ మఖ్తల నాయకత్వంలోని కేఆర్టీఏ సభ్యులు తనను పలు మార్లు కలిసి ప్రత్యేక రాష్ట్ర అవశ్యకతను స్పష్టంగా వివరించేవారని దేవేగౌడ గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించిన స‌భ‌లో తాను పాల్గొన్న సంద‌ర్భం విశేష అనుభూతి క‌లిగించింద‌ని తెలిపారు. తెలంగాణ వారిలో పోరాట స్ఫూర్తి ఎక్కువ అని ఆయన అన్నారు. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ బీఆర్ఎస్ నిర్ణ‌యం విజ‌యవంతం కావాల‌ని ఆకాంక్షించారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు జేడీ (ఎస్‌) అండ‌గా ఉంటుంద‌ని పేర్కొంటూ, పంప‌న తెలంగాణ భ‌వ‌న్ ఏర్పాటుకు త‌మ ప్ర‌భుత్వం లేఖ ఇవ్వ‌డ‌మే దీనికి తాజా ఉదాహ‌ర‌ణ అని వెల్ల‌డించారు. 

కేఆర్‌టీఏ అధ్య‌క్షుడు సందీప్ మ‌ఖ్త‌ల, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఈవీ స‌తీష్  ద్వారా తెలంగాణ‌తో స‌హా దేశంలోని రాజ‌కీయ ప‌రిణామాల గురించి అడిగి తెలుసుకున్న మాజీ ప్ర‌ధాని దేవేగౌడ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తెలంగాణ‌లో ద‌క్కుతున్న సంఘీభావంతో పాటుగా కేఆర్‌టీఏ రూపంలో మ‌ద్ద‌తు ద‌క్క‌డం సంతోష‌మ‌ని దేవేగౌడ పేర్కొన్నారు. కేఆర్‌టీఏకు త‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 

కేఆర్‌టీఏ అధ్య‌క్షుడు సందీప్ మ‌ఖ్త‌ల, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఈవీ స‌తీష్ మాట్లాడుతూ.. కేఆర్‌టీఏకు మాజీ ప్రధాని దేవేగౌడ‌, జేడీ (ఎస్‌) నాయ‌కులు ఆది నుంచి అండ‌గా నిలుస్తున్నార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న బీఆర్ఎస్ నిర్ణ‌యానికి త‌మ మ‌ద్ద‌తు ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. మాజీ ప్ర‌ధాని దేవేగౌడ రాజ‌కీయ అనుభ‌వం, జేడీ (ఎస్‌) మ‌ద్ద‌తుతో రాబోయే కాలంలో నిజాం హైద‌రాబాద్ రాష్ట్రంలోని ప్ర‌స్తుత క‌ర్ణాటక ప్రాంతంలో కేఆర్‌టీఏను విస్త‌రించ‌నున్న‌ట్లు సందీప్ మ‌ఖ్త‌ల వెల్ల‌డించారు. ఈ బేటీలో సందీప్ మ‌ఖ్త‌లతో పాటు కేఆర్‌టీఏ సభ్యులు ఈ వీ సతీష్, మధు, లక్ష్మణ యాదవ్, సుదర్శన్, లక్ష్మి పాల్గొన్నారు. 



టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget