అన్వేషించండి

Hyderabad News: ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయిన విమానాలు - శంషాబాద్ లో ఘటన

Telangana News: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ సంస్థకు చెందిన విమానాలు ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనతో తమ ఇబ్బందులను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Flights Left Without Passengers In Shamshabad: ప్రయాణికులను ఎక్కించుకోకుండానే విమానాలు వెళ్లిపోయిన ఘటన శంషాబాద్ (Shamshabad)లో గురువారం జరిగింది. ఓ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థ విమానాలు వెళ్లిపోయాయి. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలకు వెళ్లేందుకు దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణికులు ఓ ఎయిర్ లైన్స్ సంస్థలో టికెట్లు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకుని వెబ్ చెక్ ఇన్ కోసం ప్రయత్నించగా సర్వర్ పని చేయలేదు. దీంతో టికెట్లు ఉన్నప్పటికీ ప్రయాణికుల జాబితాలో వారి పేరు లేదని విమానాశ్రయ సిబ్బంది లోపల గేటు వద్ద వారిని అనుమతించలేదు. దీంతో సహనం కోల్పోయిన కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, దీనిపై ఆలస్యంగా స్పందించిన యాజమాన్యం తమ వేరే సర్వీసుల్లో వారిని గమ్యస్థానాలకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా, ఈ సమస్య తమ దృష్టికి రాలేదని.. సర్వర్ పునరుద్ధరించుకునే బాధ్యత సంబంధింత ఎయిర్ లైన్స్ దే అని ఎయిర్ పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు.

చిక్కిన చిరుత

మరోవైపు, వారం రోజులుగా శంషాబాద్‌ ప్రజలు, అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న చిరుత ఎట్టకేలకు శుక్రవారం చిక్కింది. అటవీ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. ఐదు రోజుల క్రితం ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో 5 రోజుల క్రితం చిరుత కదలికలను అధికారులు గుర్తించారు. గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకినట్టు గమనించారు. ఎయిర్‌పోర్టు పరిధిలో చిరుత ఉందని తెలుసుకున్న అధికారులు, ప్రజలు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎయిర్‌ పోర్ట్ ప్రహరీ చుట్టూ అధికారులు గోడకు ఫెన్సింగ్‌ వైర్‌లు ఫిట్‌ చేసి ఉన్నారు. చిరుత అటూ ఇటూ తిరిగే క్రమంలో ఆ ఫెన్సింగ్‌కు తాకింది. దీంతో ఎయిర్‌పోర్టులో అలారమ్‌ మోగింది. అప్రమత్తమైన కంట్రోల్‌రూమ్‌ సిబ్బంది అసలు విషయాన్ని గుర్తించి అక్కడ చిరుత దాంతో పాటు రెండు పిల్లలు ఉన్నట్టు నిర్దారించారు. వెంటనే అప్రమత్తమై చిరుతను పట్టుకునేందుకు ఆపరేషన్ చిరుత ప్రారంభించారు. చిరుతను తిరిగే ప్రాంతాలను గుర్తించి.. దాన్ని బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

మేకను ఎరగా వేసి

చిరుత తరచూ వచ్చే ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు అధికారులు. ఎరగా మేకను ఉంచారు. అయితే ఆ బోను వరకు వచ్చిన చిరుత తిరిగి వెళ్లిపోయింది. 5 రోజులుగా ఇలాగే అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు అధికారుల కృషి ఫలించింది. ఎరగా ఉన్న మేకను తినేందుకు వచ్చి బోనులో చిక్కింది. వెంటనే చిరుతను బంధించిన అధికారులు జూ వద్దకు తరలించారు. చిరుత పిల్లలు ఉన్నాయా... వాటి పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 

Also Read: BRS And YSRCP: ఏపీలో వైసీపీ గెలుపు కోసం కేసీఆర్, కేటీఆర్ మాట సాయం - జగన్ గెలిస్తే బీఆర్ఎస్‌కు లాభం ఏంటి ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget