అన్వేషించండి

BRS Greater MLAs : గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా ? కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా !

Telangana Politics : గ్రేటర్ హైదరాబాద్ నేతల కీలక సమావేశానికి ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వీరంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది.

Five BRS MLAs did not attend the key meeting :  గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది. తెలంగాణ భవన్ లో ఆ పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయ్యారు. గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెపై అవిశ్వాసం పెట్టాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. అందుకే కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ సమాచారం పంపారు.అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. 

సమావేశానికి హాజరు కాని ఐదుగురు ఎమ్మెల్యేలు                         

శేరిలింగం పల్లి ఎమ్మెల్యే  అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్పుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరు కాలేదు.  కాలేరు వెంకటేష్, పద్మారావు, ప్రకాష్ గౌడ్ మాత్రమే హాజరయ్యారు. మామూలుగా అయితే ఈ సమాశం కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతోందని పిలిచారు. కానీ కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. సమావేశానికి  హాజరు కాలేదు. తలసాని నేతృత్వంలో నిర్వహించారు. ఈ కారణంగా హాజరు కాలేదా లేకపోతే.. కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్లారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సమావేశానికి హాజరు కావాలని ఫోన్లు చేసినా ఈ ఎమ్మెల్యేలు స్పందించలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

ఢిల్లీలో కేటీఆర్ - సమావేశానికి తలసాని నేతృత్వం                                  

అలాగే పదిమంది కార్పొరేటర్లు కూడా హాజరు కాలేదు. మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నాలు  ఈ  సమావేశానికి  గైర్హాజర్ అయిన నేతల వల్ల సాధ్యమయ్యే అవకాశం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మెజార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలు  కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారని .. వారి అనుచరులైన కార్పొరేటర్లు కూడా అదే దారిలో ఉన్నారని అంటున్నారు. ఒక వేళ అవిశ్వాసం పెట్టినా మజ్లిస్ సహకరిస్తే తప్ప ముందుకు సాగలేరు. మజ్లిస్ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. 

గ్రేటర్ పరిధిలో భారీ విజయాలు సాధించిన్ బీఆర్ఎస్                                       

గ్రేటర్ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ ఘన విజయాలు సాధించింది.  కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే రాష్ట్రంలో అధికారం పోవడంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అభివృద్ధి కోంస.. పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నారు. వారితో కాంగ్రెస్ సంప్రదింపులు జరిపిందని చెబుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో ... సమావేశాలకు డుమ్మా కొట్టడంతో పార్టీ మార్పు ప్రచారాలకూ మరింత ఊపు వస్తున్నట్లవుతోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget