DK Aruna Comments : తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారే - కేసీఆర్‌కు జైలు భయం పట్టుకుందన్న డీకే అరుణ
కేసీఆర్, కేటీఆర్‌పై డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందన్నారు.
తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమేనని బీజేపీ నేత డీకే అరుణ స్పష్టం చేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేటలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు... బండి సంజయ్ 'ప్రజా సంగ్రామ యాత్ర' ఎందుకు చేస్తున్నారని కేసీఆర్, కేటీఆర్ అడుగుతున్నారని.. తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుతున్న కల్వకుంట్ల కుటుంబం తప్ప, ప్రజలెవరూ సంతోషంగా లేరని ఆమె స్పష్టం చేశారు. ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు... ఏ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనుడు కేసీఆర్ .. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తాడని ఏ సర్వే కూడా చెప్పడం లేదు. అందుకే దేశ రాజకీయాలని కొత్త రాగం ఎంచుకున్నాడని విమర్శించారు. పొద్దున లేస్తే బీజేపీని, మోదీని తిట్టుడే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు జైలు భయం పట్టుకుందన్నారు.
కేటీఆర్ టైం ఇవ్వు డేట్ చెప్పు- ఏపీ మొత్తం చూపిస్తా, అభివృద్ధి కామెంట్స్‌పై రోజా రియాక్షన్
నారాయణపేట ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తా అన్న కేసీఆర్ వాగ్దానం ఏమైందని డీకే అరుణ ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా తమ జేబుల్లోకి మళ్లిస్తున్నారని.. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు చేయకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఇండియాని నెంబర్ వన్ దేశంగా మోదీ నిలబెట్టాలని ప్రయత్నిస్తుంటే... కేసీఆర్ చేస్తున్నదేమిటన్నారు. మన ఆర్మీని కూడా అవమానించే సీఎం ఒక్క కేసీఆరే అన్నారు.
ఇది ట్రైలరే, సినిమా ముందుంది - నితిన్ గడ్కరీ, హైదరాబాద్ సభలో హోరెత్తిన జై శ్రీరామ్ నినాదాలు
కేటీఆర్ కి ఎవరో ఆంధ్రా రోడ్లు బాలేదని ఆయన ఫ్రెండ్ చెప్పాడట... మరి ఆ ఫ్రెండ్ ని ఇక్కడికి కేటీఆర్ తీసుకొస్తే... ఇక్కడి రోడ్లు ఎలా ఉన్నాయో మేం చూపిస్తామని సవాల్ చేశారు. మద్యం షాపుల ద్వారా లూటీ చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వమే ..ప్రజల రక్తాన్ని తాగే జలగ కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొడుతున్న కేసీఆర్ కు బుద్ధి చెప్తామన్నారు. ప్రజల ల ఆశీర్వాదంతో మోడీ నేతృత్వంలో... తెలంగాణ లో వచ్చేది బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు.
రేవంత్ సాగర్ మీటింగ్‌కు కోమటిరెడ్డి డుమ్మా! మళ్లీ తెరపైకి విభేదాలు - వాళ్ల హాజరుపై ఉత్కంఠ