News
News
X

DK Aruna: ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఎగురవేయాలి - డీకే అరుణ

DK Aruna: హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సందర్భంగా బీజేపీ నేతలు కార్యాలయంలో సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. ప్రతి ఇంటిపై జెండా ఎగుర వేయాలని సూచించారు. 

FOLLOW US: 

DK Aruna: హైదారాబాద్ బీజేపీ జాతీయ కార్యాలయంలో.. నేతలంతా కలిసి రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా సదస్సును నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్రంలో పర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా కృశి చేస్తామని డీకే అరుణ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా సదస్సును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా.. సంబురాల్లో ప్రజలను భాగ స్వామ్యం చేయాలని ప్రధాని మోదీ నిర్మయించినట్లు తెలిపారు. మన దేశభక్తిని, జాతీయ భావాన్ని అందరం క‌లిసి చాటి చెప్పాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, బూతు స్థాయి వరకు ఈ కార్యక్రమం జరుపుకోవాలి డీకే ఆరుణ అ్ననారు. ప్రతి ఇంటి పైనా త్రివర్ణ పతాకం ఎగుర వేయాలని చెప్పారు.

వందేమాతరం అంటూ ప్రచారం చేస్తాం..

ఆగష్టు 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కార్యక్రమంపై ప్రచారం చేస్తామన్నారు. మన దేశ  జెండా గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 20 కోట్ల ఇళ్లపై జెండాలు ఎగుర వేయించాలని లక్ష్యం గా పెట్టుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఏపీలో కూడా అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమం లొ భాగస్వామ్యం కావాలని సూచించారు. ఆగష్టు 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గ్రామీణ ప్రజలే లక్ష్యంగా రఘుపతి రాఘవ రాజారాం, వందేమాతరం అంటూ ప్రచారం చేస్తామని చెప్పారు. ఆగష్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజులు ప్రతి ఇంటి పైనా జాతీయ జెండా రెపరెపలాడాలన్నారు. ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థ లు, పరిశ్రమలు.. ఇలా ప్రతీ డాబా పైన జెండా ఎగరాలని వివరించారు. విద్యార్దుల్లో దేశ భక్తి పెంపొందించేలా పోటీలు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీం.. వీటి కోసమే పని ‌చేస్తుందని డీకే ఆరుణ వ్యాఖ్యానించారు. మన జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రం చేసి.. నివాళులతో స్మరించుకోవాలన్నారు. అలాగే ప్రతి భారతీయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. మీరు చేపట్టే కార్యక్రమాన్నిసోషల్ మీడియాలో పోస్ట్ చేయమని సలహా ఇచ్చారు. వీటి కోసం ఒక లింక్ కూడా అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. బీజేపీ... కుటుంబ పాలనకు వ్యతిరేకమని వివరించారు. చాలా మంది బేజీపీలో చేరేందుకు వస్తున్నారు...

విభజన సందర్భంగా ముంపు మండలాలను ఏపీలో కలిపారని.. కానీ కేసీఆర్ ఇప్పుడు రాజకీయ కారణాలతో మాట్లాడుతున్నారని డీకే అరుణ మండి పడ్డారు. అక్కడి ప్రజలు తెలంగాణలో‌ కలపాలని ఎప్పటి నుంచో కోరుతున్నారని... అక్కడ కీసన వసతులు లేవు, కనీస అవసరాలు తీర్చ లేదని ఆమె పేర్కొన్నారు. అందుకే ప్రజల నుంచి డిమాండ్ లు పెరుగుతున్నాయని చెప్పారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారన్నారు. పెద్ద నాయకుల నుండి కింది స్థాయి నాయకుల వరకు అంతా ఉన్నారని చెప్పారు. ఏ సమయంలో చేర్చుకోవాలో మా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వివరించారు. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. 

షర్మిల ఏపీలో పార్టీ ఎందుకు పెట్టలేదు?

కాళేశ్వరం విషయంలో జగన్, కేసిఆర్ పై మంచి అండర్ స్టాండింగ్ ఉందని విమర్శించారు. ఓట్లు సమయంలో మాత్రమే వాళ్లు వ్యతిరేకిస్తారని దుయ్యబట్టారు. సెంటిమెంట్ తోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నారని.. వైయస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే షర్మిల పార్టీ పెట్టారని చెప్పారు. గతంలో వాళ్లు ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదని, పని చేయ లేదని డీకే అరుణ వ్యాఖ్యానించారు. సెంటిమెంట్ ఉన్నంత వరకు... ఆంధ్రా వాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించరన్నారు. షర్మిల ఏపీలోనే పోటీ చేయవచ్చు కదా... తెలంగాణ లో ఎందుకు పార్టీ పెట్టారని ప్రశ్నించారు. 2019 ఎన్నికలలో కూడా షర్మిల ఏపీలోనే ప్రచారం చేశారని గుర్తు చేశారు. అప్పుడు తెలంగాణ లో ఆమె ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎపి లో ఎందుకు పోటీ‌ చేయడం లేదో ఆమే చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. 

Published at : 30 Jul 2022 03:00 PM (IST) Tags: dk aruna DK Aruna Comments on Sharmila DK Aruna Latest News DK Aruna Comments on Sharmila State Level Conference on Har Ghar Tiranga

సంబంధిత కథనాలు

Telangana Cabinet :  ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!

What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

Karimnagar Gandhi: కరీంనగర్ గాంధీ బోయినపల్లి వెంకట రామారావు గురించి మీకు తెలుసా?

Karimnagar Gandhi: కరీంనగర్ గాంధీ బోయినపల్లి వెంకట రామారావు గురించి మీకు తెలుసా?

టాప్ స్టోరీస్

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?