Disha Encounter Case: తుది ఘట్టానికి దిశ ఎన్ కౌంటర్ కేసు, మరో రెండు వాయిదాల్లో తీర్పు వచ్చే అవకాశం!
Disha Encounter Case: దిశ ఎన్కౌంటర్ కేసులో కమిషన్ నివేదికపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి, ఎన్కౌంటర్ బాధితుల తరపున లాయర్ కృష్ణమాచార్య వాదనలు వినిపించారు.
Disha Encounter Case: దిశ ఎన్ కౌంటర్ కేసులో కమిషన్ నివేదికపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ప్రభుత్వం తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి, ఎన్ కౌంటర్ బాధితుల తరపున లాయర్ కృష్ణమాచార్య కోర్టులో వాదనలు వినిపించారు. ఇపు వర్గాల వైపు వాదనలు విన్న హైకోర్టు ఈ కేసును జూన్ 21కి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే బాధితుల తరఫున వాదించిన లాయర్ కృష్ణమాచార్య మాట్లాడుతూ.. ఎన్కౌంటర్ లో పాల్గొన్న 10 మంది పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఎన్కౌంటర్ సమయంలో సీపీగా ఉన్న సజ్జనార్ కూడా నోటీస్ అందుకున్నట్లు చెప్పారు. నోటీసులో తమ వాదన వినిపించాలని హైకోర్టు పేర్కొంది. మరోవైపు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై 302 పెట్టాలని హైకోర్టును కోరినట్లు వెల్లడించారు. దీంతో పాటే బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని కూడా కోరినట్లు లాయర్ కృష్ణమాచార్య స్పష్టం చేశారు. నష్టపరిహారం అంశంలో ధర్మాసనం సానుకూలంగా ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. దిశ కేసు తుది ఘట్టానికి చేరుకున్నట్టు తెలుస్తోందని.. మరో రెండు వాయిదాల్లో తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు కేసును జూన్ 21కి వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే..?
దిశ హత్య, ఆ తరువాత జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ దేశ వ్యాప్తంతా సంచలనం సృష్టించింది. అయితే నిందితుల ఎన్ కౌంటర్ పై ప్రజల నుండి అంతలా వ్యతిరేకత రానప్పటికీ మానహక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. డిసెంబర్ 19వ తేది 2019 లో దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసారు. సీన్ రీకనస్ట్రక్షన్ లో భాగంగా నిందితులను స్పాట్ కు తీసుకెళ్తే , పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో ఎన్ కౌంటర్ చే ామంటూ పోలీసులు తరుపున వాదనలు వినిపిస్తుంటే, ఇదింతా ఫేక్ ఎన్ కౌంటర్ అంటూ సుప్రీం కోర్టు నియమంచిన జుడిషియల్ కమీషన్ సుప్రీకోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ తెలంగాణా హైకోర్టులో జరపాలంటూ సుప్రీం ఆదేశించడంతో ఇప్పటికే దిశ ఎన్ కౌంటర్ లో బాధితుల తరుపున వాదనలు ముగిశాయి.
తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు అనేక కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దిశ ఎన్ కౌంటర్ వ్యవహారంపై ప్రభుత్వం తరుపు వాదనలను వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ తీరుపై తీవ్ర అంసతృప్తిని వక్తం చేసినట్లు సమాచారం. మొత్తం ఐదు ఇంప్లీడ్ పిటీషన్లపై అంగీకరించిన హైకోర్టు , అప్పటి షాద్ నగర్ సీఐ శ్రీధర్ తోపాటు పోలీస్ ఆఫీసర్స్ సంఘం , రిటైర్డ్ పొలీస్ ఆఫీసర్స్, దిశా కుంటుంబం తరుపు న్యాయవాదుల వాదనలు విన్నది .
ఈ కేసులో షాద్ నగర్ సీఐ శ్రీధర్ తరుపున వాదించిన సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ రఘురామ్, జుడీషియల్ కమీషన్ నివేదికను పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదన్నారు. మరోపు సిఐ శ్రీదర్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఈ కేసులో రెండో ఎఫ్ ఐఆర్ అవసరం లేదన్నారు.క మీషన్ రిపోర్ట్ ను కేవలం ఒక్క ఆధారంగా చూడాలని, రిపోర్ట్ లో ఉన్నది ఉన్నట్లు ఆర్డర్ ఇవ్వాలని లేదన్నారు. గతంలో ఎన్ కౌంటర్ వ్యవహారంపై సిట్ ఇచ్చిన నివేదిక పై సెషన్స్ కోర్టులో విచారణ జరపాలని దిశ కుటుంబసభ్యుల తరుపు న్యాయవాది కోరారు.