అన్వేషించండి

BRS is TRS Again : బీఆర్ఎస్‌ మళ్లీ టీఆర్ఎస్ - కడియం శ్రీహరి వ్యాఖ్యలతో విస్తృత చర్చ !

TRS : టీఆర్ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా మార్చడం వల్ల నష్టపోయామని కడియం శ్రీహరి హైకమాండ్‌కు చెప్పారు. మళ్లీ పేరు మార్చాలని ఆయన సూచించారు. శ్రీహరి సూచనకు బీఆర్ఎస్‌లో మద్దతు పెరుగుతోంది.


BRS is TRS Again :   భారత రాష్ట్ర సమితి పార్టీ పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలన్న డిమాండ్లు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి.  జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించి తెలంగాణ రాష్ట్ర సమితి  ని భారత్ రాష్ట్ర సమితి గా మార్చారు కేసీఆర్. అయితే  తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోయినట్లుగా అయింది. అలా పేరు మార్చినప్పుడే.. చాలా మంది తెలంగాణతో ఇక బీఆర్ఎస్‌కు సంబంధంలేదని ప్రచారం చేశారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.  బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లి ఓడిపోయామని..  పార్టీ తిరిగి పూర్వపేరుకు వెళ్లడం ద్వారా ప్రజలకు తిరిగి దగ్గరవ్వాలని భావిస్తోంది. 

బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలన్న కడియం శ్రీహరి                 

ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి ఈ ప్రతిపాదనను పార్టీ నేతల ముందు పెట్టారు.   తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో కడియం ఈ  విషయానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు.  పార్టీలో తెలంగాణను తీసేసి భారత్‌ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని, ఒకటిరెండు శాతంమంది ప్రజలు అలా భావించి దూరమై ఉంటారని భావిస్తున్నారు. వారిని తిరిగి ఆకర్షించాలంటే పార్టీ పేరును మార్చడం తప్ప మరోమార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు, ఎక్కువమంది కార్యకర్తలు  కూడా అదే అభిప్రాయపడుతున్నట్టు కడియం శ్రీహరి చెప్పినట్లుగా తెలుస్తోంది.                 

ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయని కేటీఆర్, హరీష్ రావు                                                

కడియం శ్రీహరి వ్యాఖ్యలపై కేటీఆర్, హరీష్ రావు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కానీ పలువురు క్యాడర్ మాత్రం కడియం చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. కానీ ఇప్పుడు మళ్లీ పార్టీ మార్చడం సాధ్యమేనా అన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది. సాంకేతికంగా పేరు మార్చడానికి పెద్ద ఇబ్బందేం ఉండదని.. తీర్మానం చేసి పంపితే.. ఎన్నికల సంఘం ప్రాసెస్ ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది కానీ ఇలా చేయడం వల్ల నిలకడ లేని రాజకీయ విధానంపై ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతుందని అది ఇంకా మైనస్ అవుతుందన్న అభిప్రాయంతో కొంత మంది ఉన్నారు. 

ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిందని పార్టీ నేతల అభిప్రాయం 

భారత రాష్ట్ర సమితి అనే  పేరు ఎక్కువగా ప్రచారం జరగకుండా చూసుకున్నా ప్రయోజనం ఉండటం లేదని.. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తారని ఎక్కువ మంది భావించడంతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చకపోయినా తర్వాత జరిగే పరిణామాలను బట్టి.. రెండు, మూడేళ్ల తర్వాత కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
AP Inter Exams: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Romantic Life : శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
Embed widget