అన్వేషించండి

Delhi Liquor Scam: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఈడీ సోదాలు, నేడు ఏం తేలనుంది !

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. మరోవైపు కల్వకుంట్ల కవితపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై బీజేపీ నేతలు గత కొన్ని రోజులుగా లిక్కర్ స్కామ్‌లో ఆమె హస్తం ఉందని ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆమె ప్రమేయం కీలకమని.. కాషాయ నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈయన పలువురు రాజకీయ నాయకులకు అకౌంటెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో  కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు  సన్నిహితులుగా పేరు పడిన అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డి వంటి వారి ఇళ్లలో రెండు సార్లు సోదాలు నిర్వహించింది.  

దేశవ్యాప్తంగా విస్తృతంగా ఈడీ సోదాలు 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ సహా 43 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అటు నెల్లూరులోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుపుతోంది. ఢిల్లీ లోథీ రోడ్ లోని 95 నెం. బంగ్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఇందిరాపార్క్ చౌరస్థాలోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో సోదాలు జరుగుతున్నాయి. రాయదుర్గంలోని జయభేరి సౌత్ బ్లాక్ లో అభినయ్ రెడ్డి అనే వ్యాపారవేత్త ఇంట్లో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అటు తిహార్ జైలులో సత్యేంద్ర జైన్ ను ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు వెళ్లారు.  

హైదరాబాద్‌పై స్పెషల్‌గా ఫోకస్ పెట్టిన ఈడీ !

సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. గతంలో ఓ సారి దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ... ఇప్పుడు కేవలం హైదరాబాద్ లో జరిగిన వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్ింది.  ఇప్పటికే హైదరాబాద్ సిటీలో రెండుసార్లు సోదాలు జరిపింది. ఇప్పుడు మూడోసారి పెద్ద ఎత్తున రంగంలోకి దిగడంతో ఈ స్కాంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గత తనిఖీల సమయంలో రామచంద్రపిళ్లై ఇల్లు, ఆఫీస్ లలో సోదాలు జరిగాయి. ఇప్పుడు ఆడిటర్ అయిన గోరంట్ల అండ్ అసోసియేట్స్‌ ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లోనూ సోదాలు జరగడం చర్చనీయాంశమవుతోంది. 

తనపై ఆరోపణలు చేయకుండా స్టే తెచ్చుకున్న కవిత 

కల్వకుంట్ల కవిత ఇప్పటికే బీజేపీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. గతంలో ఢిల్లీలో సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత పేరు లేదు. కానీ ఆమె  పై బీజేపీ నేతలు వరుసగా విమర్శలు చేశారు. ఈ కారణంగా ఆమె కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు  ఈ కేసులో సంబంధం ఉందని..  విచారణ కోసం ఈడీ నోటీసులు జారీ చేసిందని ప్రచారం కావడం దుమారం రేపుతోంది. కానీ ఆమెకు గానీ, ఆమె ఇంట్లో వ్యక్తులకు ఈడీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని సమాచారం. 

Also Read: Telangana Liberation Day 2022: ఆపరేషన్ పోలో అంటే ఏంటి? భారత్‌లో హైదరాబాద్ విలీనం ఎలా జరిగిందో తెలుసా !

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget