Dasara Holidays: పిల్లలూ దసరా సెలవులు వచ్చేశాయి.. మళ్లీ స్కూల్ కి ఎప్పుడంటే
బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని విద్యార్థులకు సెలవులు వచ్చేశాయి. 12 రోజులు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
కరోనా కారణంగా ఇప్పటికే దాదాపు రెండేళ్లుగా ఇంట్లోనే ఉన్నారు విద్యార్థులు. ఇటీవలే బడులు స్టార్ట్ అయ్యాయి. అయితే మళ్లీ దసరా సెలవులు వచ్చేశాయి. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని బుధవారం నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఈ రెండు పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకోనున్నాయి.
13 నుంచి ఇంటర్ కాలేజీలకు..
ఇంటర్ కాలేజీలకు ఈ నెల 13వ తేదీ నుంచి సెలవులివ్వనున్నారు. 13 నుంచి 16 వరకు నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయి.
దసరా పండగ సందర్భంగా.. ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ దసరాకు 4,045 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని వెల్లడించారు. దసరా సందర్భంగా 3,085 బస్సులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, 950 బస్సులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రద్దీని బట్టి నడుపుతామని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమైన బస్ స్టేషన్లు జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు బీహెచ్ఈఎల్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్ పేట్, టెలీఫోన్ భవన్, దిల్‌సుఖ్‌గర్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, అరాంఘర్ క్రాస్ రోడ్‌ల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయి. రిజర్వేషన్ సౌకర్యం ఉన్న బస్సులపై ఒకటిన్నర శాతం ఛార్జీలు అధికంగా వసూలు చేస్తామని అధికారులు చెప్పారు.
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి.. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ వెళ్లే బస్సులు ఉంటాయి. ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్, పరకాల, మహబూబాబాద్, భువనగిరి, యాదగిరి గుట్టకు వెళ్లే బస్సులు ఉంటాయి. నల్గొండ, కోదాడ, సూర్యాపేటకు వెళ్లే వారి కోసం దిల్‌సుఖ్‌నగర్ నుంచి బస్సులు ఉండనున్నాయి. కడప, కర్నూల్, చిత్తూర్, అనంతపురం, ఒంగోలు, నెల్లూర్‌కు ఓల్డ్ సీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులుంటాయి. ఎంజీబీఎస్ నుంచి మిగిలిన బస్సులను నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు.
Also Read: TSRTC: దసరాకు ఇంటికి వెళ్తున్నారుగా.. టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఉంటాయి .. జర చూసుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి