![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Daanam Nagender : 15 రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం - దానం నాగేందర్ కీలక ప్రకటన
Telangana : పదిహేను రోజుల్లో బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందని దానం నాగేందర్ ప్రకటించారు. బీఆర్ఎస్‌లో నలుగురే మిగులుతారని జోస్యం చెప్పారు.
![Daanam Nagender : 15 రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం - దానం నాగేందర్ కీలక ప్రకటన Danam Nagender announced that BRSLP will merge with Congress in fifteen days Daanam Nagender : 15 రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం - దానం నాగేందర్ కీలక ప్రకటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/8cb1da4c1c8f8a5b606c960fa9896ad61720770388877228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Congress And BRS Politics : పదిహేను రోజుల్లో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం కాంగ్రెస్ పార్టీ ఎల్పీలో విలీనం అవుతుందని .. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు బీఆర్ఎస్‌లో నలుగురు మాత్రమే ఎమ్మెల్యేలు మిగులుతారని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపాడని.. కేసీఆర్ ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్మెంట్ కూడా దొరికేది కాదన్నారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హిమాయత్ నగర్ డివిజన్ కు సంబంధించిన కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలకు ఘోర అవమానాలు
ఎవరైనా ఎమ్మెల్యేకు అపాయింట్‌మెంట్ ఇచ్చినా ప్రగతి భవన్‌లో గంటల తరబడి వెయిట్ చేయించేవారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండదన్నారు. స్వేచ్చ ఉంటుందని అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారన ితెలిపారు. బీఆర్ఎస్ పై నమ్మకం లేకనే MLA లు కాంగ్రెస్ లో చేరుతున్నారని.. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే లను పురుగుల్లా చూసేవారు... అందుకే విలువ లేని చోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో అందరికి విలువ ఉంటుందన్నారు. గతం లో కాంగ్రెస్ హయాంలో MLA లకు స్పెషల్ డవలప్మెంట్ ఫండ్ ఉండేదిని.. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అంటే అసలు ఫండే లేదని గుర్తు చేశారు.
ఆ ఇద్దరిలో ఎవరు సన్నాసో చెప్పాలి, వీపులు పగలగొట్టడమే ప్రజాపాలనా?: కేటీఆర్
కేటీఆర్ బినామీలు దోచుకున్న వివరాలు బయట పెడతా !
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని.. వాటి వివరాలు త్వరలో బయట పెడతానని ప్రకటించారు. 10 ఏళ్లలో కేటీఆర్ బినామిలు వేల కోట్లు దండుకున్నారు...త్వరలో సాక్ష్యాలతో సహా బయటపెడుతానని ప్రకటించారు. ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని మేకపోతు గంభీరం చూపిస్తున్నారని.. సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా... రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
రేవంత్‌కు టార్గెట్ చేసే కురియన్ కమిటీ విచారణ - తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది ?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపు బీఆర్ఎస్ఎల్పీ విలీనం
అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లోపు బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని దానం నాగేందర్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు చేరారు. పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)