Cyberabad Traffic Police: హెల్మెట్ ఫుల్ కవర్ అయి ఉండాలన్నాం.. ఇలా కవర్ నే హెల్మెట్ లా వాడమనలేదు
ప్రజలు, వాహనదారులకు సమాచారాన్ని చెప్పడంలో తెలంగాణ పోలీసుల రూటే సపరేటు. చూసేందుకు పడి.. పడి నవ్వుకునేలా ఉండే మీమ్స్ తోనే మంచి మెసేజ్ ఇస్తారు.
తెలంగాణలో పోలీసు ట్విట్టర్ ఖాతాలోకి వెళ్తే.. చాలా మీమ్స్ కనిపిస్తాయి. అవన్నీ చూసి నవ్వుకునేలా ఉన్నా.. అందులోని మెసేజ్ మాత్రం మన ప్రాణాలకు రక్షణ కోసమే. సోషల్ మీడియా ఆధారంగా చేసుకుని.. ప్రజల్లో అవగాహన పెంచుతుంటారు. అప్పుడప్పుడు ట్రోలింగ్ చేస్తుంటారు. అది కూడా.. ఇలాంటి తప్పులు కూడా చేస్తున్నారు.. మీరు చేయోద్దు.. మీకే సమస్య అని చెప్పడానికే.. ఇక అసలు విషయానికి వస్తే..
ఓ వ్యక్తి.. బైక్ మీద వెళ్తున్నాడు. వెనకలే ఓ మహిళ కూర్చొంది. వాహనం నడుపుతున్న వ్యక్తితోపాటు వెనకల కూర్చున్న వ్యక్తి కూడా.. హెల్మెట్ ధరించాలనే రూల్ ఉంది. అయితే వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నాడు. కానీ వెనకల కూర్చున్న మహిళ హెల్మెట్ కి బదులు కవర్ పెట్టుకుంది. ఇంకేం.. ఈ చిత్రం.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. దానిపై ట్విట్ చేశారు. 'హెల్మెట్ ఫుల్ కవర్ అయి ఉండాలి అన్నారు కానీ కవర్ ని హెల్మెట్ లా వాడమనలేదు. హెల్మెట్ పెట్టుకోండి. సురక్షితంగా ఉండండి.' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
హెల్మెట్ ఫుల్ కవర్ అయి ఉండాలి అన్నారు కానీ కవర్ ని హెల్మెట్ లా వాడమనలేదు.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) October 27, 2021
హెల్మెట్ పెట్టుకోండి. సురక్షితంగా ఉండండి. #RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/XuDRy01lhW
వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరి ధరించాలనే నిబంధం ఉంది. వెనక సీట్‌లో కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధన తీసుకొచ్చారు. దీనిని సైబరాబాద్ పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే.. ఫొటోలు తీసి.. చలనాలు పంపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు.
బైక్ పై ప్రయాణించేటప్పుడు రైడర్ మరియు పిలియన్ రైడర్ ఇద్దరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి.#RoadaSafety #RoadSafetyCyberabad #WearHelmet pic.twitter.com/plKiqlYklO
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 30, 2021
Also Read: Cyberabad Police: ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా..!’ ట్వీట్ చేసిన పోలీసులు.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే..
Also Read: Cyberabad traffic police: ఇదేందయ్యా ఇదీ.. ఎక్కడి నుంచి చూస్తున్నారయ్యా?!