New Year Celebrations: భాగ్యనగరంలో న్యూ ఇయర్ వేడుకలు - డిసెంబర్ 31న రాత్రి ఉచిత ప్రయాణం, ఈ విషయాలు గుర్తుంచుకోండి
Hyderabad News: భాగ్యనగరంలో న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు ఆంక్షలు విధించారు. ఐటీ కారిడార్‌లో డిసెంబర్ 31న రాత్రి నుంచి ఉదయం వరకూ ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు తెలిపారు.
Closure Of Flyovers In Hyderabad Due To New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) సందర్భంగా భాగ్యనగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్ (Cyberabad) కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ఐటీ కారిడార్‌లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్‌పై భారీ వాహనాలు, ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించిన వారికి పబ్‌లు, బార్ల యజమానులు ప్రైవేట్ వాహనాలు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని పోలీసులు సూచించారు.
అటు, డిసెంబర్ 31న అర్ధరాత్రి దాటాక ఓఆర్ఆర్‌తో పాటు అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్శిటీ ఫ్లైఓవర్లు, షేక్ పేట్, మైండ్ స్పేస్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్ JNTU ఫ్లైఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్‌ను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ మూసివేయనున్నారు.
ఉచిత ప్రయాణం
అటు, న్యూ ఇయర్ వేడుకల వేళ తెలంగాణ ఫోర్ వీలర్స్ సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31న రాత్రి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు పేర్కొంది. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని, రోడ్డు ప్రమాదాలు జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 500 కార్లు, 250 క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయని అసోసియేషన్ తెలిపింది. మరోవైపు, క్యాబ్‌లు, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలని, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. క్యాబ్ డ్రైవర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ రైడ్ రిజెక్ట్ చెయ్యొద్దని.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
మెట్రో గుడ్ న్యూస్
మరోవైపు, నూతన సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్ మెట్రో నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం రాత్రి 12.30 వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రతి కారిడార్‌లో చివరి మెట్రో స్టేషన్ నుంచి ఆఖరి సర్వీస్ 12:30 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రవాణా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వివిధ పాయింట్స్ నుంచి రాత్రి 12.30కి బయల్దేరిన ట్రైన్ ఆఖరి గమ్యానికి రాత్రి 1.15కు చేరుకుంటుందని ఎల్అండ్‌టీ మెట్రో 'ఎక్స్' వేదికగా పేర్కొంది.
మరోవైపు, డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక బార్లు, రెస్టారెంట్స్‌ను అర్థరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చునని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అటు, జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్‌లు ఉండగా.. ఇందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఈవెంట్స్, పార్టీలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.
Also Read: Cyber Security: సైబర్ మోసాలకు ఇలా చెక్ పెట్టేద్దాం - ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు ఫుల్ సేఫ్!