అన్వేషించండి

Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !

Congress party : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం తమ ప్రభుత్వం ఇచ్చిన జీవో 29ను సమర్థించుకుంటూంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాత్రం విపక్షాల వాయిస్ వినిపించడం సంచలనంగా మారింది.

Congress party own MLC Theenmar Mallanna Gave Shock to Party :  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీసీ సంఘాలతో కలిసి గవర్నర్ ను కలిశారు.జీవో 29పై ఫిర్యాదు చేశారు. ఈ జీవో వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. జీవో 29 ప్రకారం పరీక్షలు నిర్వహించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ పరీక్షలు ముందుకు వెళ్లేవి కాదని స్పష్టం చేశారు. దీనికి ఖచ్చితంగా అడ్డుకట్ట పడుతుందన్నారు. EWS రిజర్వేషన్లు అక్రమం అని.. గవర్నర్‌కు నివేదించామని మా నాయకడు రాహుల్ గాంధీ కులాలవారీగా జనాభాను బట్టి అవకాశాలు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించారన్నారు. ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్లు, బీసీల హక్కులను కాలరాయడానికి ఎవరు ప్రయత్నించినా అది మా పార్టీ అయినా సరే వదిలి పెట్టబోమని ఆయన హెచ్చరించారు.

తీన్మార్ మల్లన్న ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన ఎప్పుడూ పార్టీ పాలసీని పట్టించుకోవడం లేదు. తన సొంత అభిప్రాయాల మేరకే రాజకీయం చేస్తున్నారు.తాజాగా జీవో 29 విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతా ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తోంది. ఈ  జీవో వల్ల ఎవరికీ అన్యాయం జరగదని పైగా.. బడుగు, బలహీన వర్గాలకే మేలు అని వాదిస్తున్నారు. కానీ తీన్మార్ మల్లన్న మాత్రం .. ఈ జీవో వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని.. ఓ వర్గం వారికి ఉద్యోగాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారని ఆరోపిస్తూ సొంత పార్టీ పై బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.                        

గ్రూప్‌ 1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ- జోక్యం చేసుకోలేమని స్పష్టం

జీవో 29ను ఎప్పుడో ఫిబ్రవరిలో ఇస్తే ఇప్పుడే పరక్షల ముందు ఎందుకు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతా రాజకీయ పరమైన కుట్ర అని వారంటున్నారు. న్యాయస్థానాల్లోనూ ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పులు రావడంతో పరీక్షలను అనుకున్న సమయానికే నిర్వహిస్తున్నారు.  అయితే ఈ పరీక్షలు నిలబడేవి కూడా కావని తీన్మార్ మల్లన్న అంటున్నారు. మల్లన్న తీరు వల్ల.. పరీక్షలను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ పై విపక్షాలు విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది.                        

వాలంటీర్‌ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు!

తీన్మార్ మల్లన్న గతంలో సొంతగా రాజకీయం చేసేవారు. కేసీఆర్ హయాంలో అనేక కేసులు నమోదు కావడంతో జైలుకెళ్లారు. బెయిల్ వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలు చోట్ల నుంచి టిక్కెట్ ఆశించినా దక్కలేదు. చివరికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు నేరుగా సీఎం రేవంత్ ను.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కాంగ్రెస్ పార్టీలోనే సంచలనంగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS MLA Jagadeesh Reddy Suspended: జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ సంచలన నిర్ణయం
BRS MLA Jagadeesh Reddy Suspended: జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ సంచలన నిర్ణయం
Telangana Latest News: తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాం- బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం!
తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాం- బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం!
కృష్ణ కృష్ణా... జైలు జీవితంలో జ్ఞానోదయం అయ్యిందా? ‌మీరు మారిపోయారు సార్!
కృష్ణ కృష్ణా... జైలు జీవితంలో జ్ఞానోదయం అయ్యిందా? ‌మీరు మారిపోయారు సార్!
Revanth Reddy Latest News : కిషన్ రెడ్డి రావాలి- హక్కులపై మాట్లాడాలి- డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ 
కిషన్ రెడ్డి రావాలి- హక్కులపై మాట్లాడాలి- డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kerala teen dies due to water fasting | వాటర్ డైట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతీ | ABP DesamYS Jagan YSRCP Formation Day | మెడలో పార్టీ కండువాతో కనిపించిన జగన్..రీజన్ ఏంటంటే | ABP DesamPithapuram Public Talk on Pawan Kalyan | కళ్యాణ్ గారి తాలుకా అని పిఠాపురంలో చెప్పుకోగలుగుతున్నారా.?Gun fire in Chittoor Locals Rescue Operation | పోలీసుల వచ్చేలోపే గన్నులతో ఉన్న దొంగలను పట్టుకున్న స్థానికులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLA Jagadeesh Reddy Suspended: జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ సంచలన నిర్ణయం
BRS MLA Jagadeesh Reddy Suspended: జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ సంచలన నిర్ణయం
Telangana Latest News: తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాం- బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం!
తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాం- బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం!
కృష్ణ కృష్ణా... జైలు జీవితంలో జ్ఞానోదయం అయ్యిందా? ‌మీరు మారిపోయారు సార్!
కృష్ణ కృష్ణా... జైలు జీవితంలో జ్ఞానోదయం అయ్యిందా? ‌మీరు మారిపోయారు సార్!
Revanth Reddy Latest News : కిషన్ రెడ్డి రావాలి- హక్కులపై మాట్లాడాలి- డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ 
కిషన్ రెడ్డి రావాలి- హక్కులపై మాట్లాడాలి- డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ 
Tamil Nadu Latest News: తమిళనాడులో ముదిరిన త్రిభాషా వివాదం- హిందీ రూపీ '₹'సింబల్‌ తిరస్కరించిన స్టాలిన్!
తమిళనాడులో ముదిరిన త్రిభాషా వివాదం- హిందీ రూపీ '₹'సింబల్‌ తిరస్కరించిన స్టాలిన్!
Nara Lokesh : కాశీనాయన ఆశ్రమంలో పునర్ నిర్మాణ పనులు .. హామీ ఇచ్చిన 24 గంటల్లోపే అమలు చేసిన లోకేష్!
కాశీనాయన ఆశ్రమంలో పునర్ నిర్మాణ పనులు .. హామీ ఇచ్చిన 24 గంటల్లోపే అమలు చేసిన లోకేష్!
Raja Singh: పాతసామాను బయటపడేస్తేనే బీజేపీకి మంచి రోజులు- రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు 
పాతసామాను బయటపడేస్తేనే బీజేపీకి మంచి రోజులు- రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు 
SSMB29: మహేష్ బాబు - రాజమౌళి మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం బిగ్ అప్‌డేట్... షూటింగ్ లొకేషన్ లీక్
మహేష్ బాబు - రాజమౌళి మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం బిగ్ అప్‌డేట్... షూటింగ్ లొకేషన్ లీక్
Embed widget