అన్వేషించండి
Attack on BRS Leaders Convoy: బీఆర్ఎస్ నేతల కాన్వాయ్ అడ్డగింత - 'కేటీఆర్ గో బ్యాక్' అంటూ నినాదాలు, బస్సుపై కోడిగుడ్లతో దాడి
Nalgonda News: నల్గొండ సభకు వెళ్తుండగా బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ తగిలింది. వీటి కాలనీ వద్ద వీరి కాన్వాయ్ ను NSUI కార్యకర్తలు అడ్డుకుని బస్సుపై కోడిగుడ్లు విసిరారు.
![Attack on BRS Leaders Convoy: బీఆర్ఎస్ నేతల కాన్వాయ్ అడ్డగింత - 'కేటీఆర్ గో బ్యాక్' అంటూ నినాదాలు, బస్సుపై కోడిగుడ్లతో దాడి congress leaders protest against brs leaders in nalgonda Attack on BRS Leaders Convoy: బీఆర్ఎస్ నేతల కాన్వాయ్ అడ్డగింత - 'కేటీఆర్ గో బ్యాక్' అంటూ నినాదాలు, బస్సుపై కోడిగుడ్లతో దాడి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/14b5ff5a097fea4234c0c0e14a8bd79c1707826220883876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బీఆర్ఎస్ నేతల కాన్వాయ్ పై దాడి (Image Source: Twitter)
Attack on BRS Leaders Convoy in Nalgonda: మాజీ మంత్రులు హరీష్ రావు (Harishrao), కేటీఆర్ (KTR), బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ తగిలింది. నల్గొండలో బహిరంగ సభకు వెళ్తున్న నేపథ్యంలో.. వీటి కాలనీ వద్ద వీరి కాన్వాయ్ ను NSUI కార్యకర్తలు అడ్డుకుని.. వారి వాహనంపై కోడిగుడ్లు విసిరారు. నల్ల చొక్కాలు ధరించి.. 'కేటీఆర్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు, నల్గొండ సభకు బీఆర్ఎస్ నేతలు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion