Huzurabad Congress : హుజురాబాద్ ఓటమికి మీరంటే మీరే కారణం.. ఢిల్లీలోనూ టీ కాంగ్రెస్ నేతలది అదే పంచాయతీ !
హుజురాబాద్ ఎన్నికల్లో ఘోరపరాజయానికి కారణం మీరంటే మీరని టీ కాంగ్రెస్ నేతలు హైకమాండ్ ముందు నిందించుకున్నారు.
హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ గ్రూపులు బలపడటానికి కారణం అయింది. ఘోర పరాజయానికి కారణాలేమిటో సమీక్ష చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సమీక్ష నిర్వహించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ నేతృత్వంలో ఢిల్లీలో సమీక్ష జరిగింది. ఈ సమీక్షకు టీ పీసీసీ ముఖ్య నేతలు, హుజురాబాద్ ఎన్నికల్లో బాధ్యతలు తీసుకున్న వారినందర్నీ ఆహ్వానించారు. ఇలా వెళ్లిన నేతలు పరాజయానికి కారణం మీరంటే మీరని విమర్శలు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు.
Also Read : టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఆశావహుల టెన్షన్..టెన్షన్ ! అభ్యర్థుల కసరత్తులో కేసీఆర్ !
హుజురాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మూడు వేల ఓట్లు కూడా రాలేదు. ఈ ఘోర పరాజయానికి బీజేపీతో కుమ్మక్కవడమే కారణమని కొంత మంది సీనియర్లు ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ ఇంచార్జులుగా పని చేసిన వారిపై విమర్శలు చేశారు. ఇలా విమర్శలు చేస్తున్న సమయంలో కేసీ వేణుగోపాల్ సమక్షంలోనే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇతర వర్గంపై మండిపడినట్లుగా తెలుస్తోంది. ఓ మండలానికి ఇంచార్జ్‌గా పని చేసిన పొన్నం ప్రభాకర్ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై మండిపడ్డారు. ఉత్తన తన సమీప బంధువు అయిన కౌశిక్ రెడ్డి కోసం టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తన మాటలు తప్పయితే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ చేశారు.
Also Read : ఖమ్మం ఎమ్మెల్సీ రేసులో తుమ్మల, పొంగులేటి.. సీఎం కేసీఆర్ మెచ్చేదెవరు?
కొంత మంది కాంగ్రెస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ విజయం కోసం సహకరిస్తున్నారని ఇలాంటి పరిస్థితి ఉంటేవచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుదంని పొన్నం ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క హుజురాబాద్ పైనే కాదని దుబ్బాక, నాగార్జున సాగర్, గ్రేటర్ ఎన్నికలపైనాసమీక్ష చేయాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఉత్తమ్ వర్గంగా పేరు పడిన మల్లు భట్టివిక్రమార్క మరో వాదన వినిపించారు. ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకుని ఉండాల్సిందన్నారు. ఈటల టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత భట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నేతల్ని కలిశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరిగింది.
అయితే ీటలను పార్టీలో చేర్చుకోవద్దని అప్పట్లో భట్టి విక్రమార్క సూచించినట్లుగా టీ కాంగ్రెస్‌లో ప్రచారం జరిగింది. ఇప్పుడు చేర్చుకుని ఉండాల్సిందని.. కొంత మంది చేరకుండా కుట్ర చేశారని భట్టి విక్రమార్క చెప్పడంతో కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈటలను చేర్చుకోవద్దని భట్టి విక్రమార్క చెప్పి.. ఇప్పుడు కొంత మంది కుట్ర చేశారని చెప్పడమేమిటని ప్రశ్నించారు. దీంతో భట్టి విక్రమార్క సైలెంటయిపోయారని చెబుతున్నారు. పార్టీలో పరాజయానికి కారణేమిటన్నదానిపై కన్నా మీరంటే మీరని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో అసలు పరాజయానికి కారణాలేమిటన్నదానిపై పూర్తి చర్చ జరగలేదని తెలుస్తోంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి