అన్వేషించండి

Telangana Elections: టీ కాంగ్రెస్‌తో సీపీఐ, సీపీఎం పొత్తు ఖరారు- ఆ నాలుగు సీట్లు కామ్రేడ్స్‌కు ఫిక్స్

Telangana Elections: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో కామ్రేడ్స్ పొత్తు కన్ఫార్మ్ అయింది. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్దమైంది.

Telangana Elections: సోమవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన క్రమంలో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలవ్వడంతో పార్టీలన్నీ వ్యూహలకు మరింత పదునుపెడుతున్నాయి. అందులో భాగంగా పొత్తులు కూడా పొడుస్తున్నాయి.  కాంగ్రెస్‌తో సీపీఎం, సీపీఐ పొత్తు ఖరారు అయింది. అంతేకాదు సీట్ల సర్దుబాటు కూడ ఒక కొలిక్కి వచ్చింది. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

ముందుగా సీపీఎం, సీపీఐకి చెరొక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. కానీ కాంగ్రెస్ ప్రతిపాదనను కమ్యూనిస్టులు తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ తలొగ్గి చెరోక రెండు స్థానాలు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు నుంచి, సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ నుంచి టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. భద్రాచలం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఉన్నారు. అయినా అక్కడ వామపక్ష పార్టీల బలం ఎక్కువగా ఉండటంతో సీపీఎంకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పోడెం వీరయ్యను పినపాక నియోజకవర్గానికి పంపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపే యోచనలో ఉంది.

కాంగ్రెస్‌లో వామపక్షాల పొత్తుపై గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో భేటీ అయిన వామపక్ష నేతలు.. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని తీర్మానం చేశారు. అనంతం పలు దఫాలుగా కాంగ్రెస్‌తో చర్చలు జరిపారు. దీంతో కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు ఖాయమని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎట్టకేలకు పొత్తు ఖరారు అయింది. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు వామపక్ష పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తు ఉంటుందనే వార్తలొచ్చాయి. వామపక్షాలకు బీఆర్ఎస్ రెండు, మూడు సీట్లు ఇస్తుందని టాక్ వినిపించింది. కానీ ఈ పొత్తు ముందుకు కదరలేదు.

బీఆర్ఎస్‌తో పొత్తు కుదరకపోవడంతో కాంగ్రెస్‌తో టచ్‌లోకి వామపక్షాలు వెళ్లాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో వామపక్షాలు కాస్త బలంగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో గణనీయమైన ఓట్లు కలిగి ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్.. వామపక్షాలను మరోసారి కలుపుకుంది. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, వామపక్ష పార్టీలు కలిసి బరిలోకి దిగాయి. కానీ గత ఎన్నికల్లో మహాకూటమిలోని పార్టీల మధ్య ఓటు ట్రాన్స్‌ఫర్ జరగలేదు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని మూటకట్టుకోవాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో కంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీట్లు తగ్గాయి. అయితే వామపక్షాల ఓట్లు సులువుగా ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశముంటుంది. దీంతో కామ్రేడ్స్‌ను కలుపుకోవడంలో కాంగ్రెస్ వ్యూహత్మకంగా అడుగులు వేసింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండలో వామపక్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ రెండు జిల్లాల్లో పొత్తు వల్ల కాంగ్రెస్, వామపక్షాలకు కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్  కలుపుకోవాలని ప్రయత్నం చేసినా.. షర్మిల డిమాండ్ల వల్ల అది కురదలేదు.

టాప్ హెడ్ లైన్స్

 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
Villa Orchids Security Failure: కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget