అన్వేషించండి

Telangana Vision Document: కోర్, ప్యూర్ , రేర్ - 3 ట్రిలియన్ ఎకానమీకి సీఎం రేవంత్ విజన్ డాక్యుమెంట్

CM Revanth: తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను సీఎం రేవంత్ విడుదల చేశారు. రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా భవిష్యత్తు కు బాటలు వేసేందుకు ప్లాన్ సిద్ధం చేశారు.

Telangana Rising Summit:  రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను ఆవిష్కరించే బృహత్తరమైన ప్రయత్నంలో భాగమే తెలంగాణ రైజింగ్​ 2047 డాక్యుమెంట్​ ను .. రైజింగ్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో  విడుదల చేశారు.  ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే రోడ్​ మ్యాప్​.  తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల భవిత కోసం..ప్రజల భవిష్యత్తు కోసం.. భావి తరాల కోసం.. ముందుచూపుతో  “తెలంగాణ రైజింగ్ 2047” డాక్యుమెంట్ రూపుదిద్దుకుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.  నాలుగు కోట్ల తెలంగాణ  ప్రజల అభిప్రాయాలు.. ఆకాంక్షలకు ఇందులో చోటు కల్పించింది. 
అన్ని శాఖల మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, మేధావులు, అన్ని రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సలహాలకు ప్రాధాన్యమిచ్చింది.  ఈ డాక్యుమెంట్​ తయారీలో NITI Aayog కీలక భూమిక నిర్వహించింది.  ISB (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) ప్రొఫెసర్లు డాక్యుమెంట్ తయారీలో పాలుపంచుకున్నారు. 
 
 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ విజన్ ప్రధాన లక్ష్యం.  దీంతో తెలంగాణ అభివృద్ధి లో ప్రపంచ దేశాల కు ధీటుగా నిలబడి.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.  రాష్టం నలుమూలల అన్ని జిల్లాల నుంచి దాదాపు 4 లక్షల మంది ఆకాంక్షలు.. అభిప్రాయాలతో ఈ డాక్యుమెంట్ రూపొందించారు.  65 శాతం యువత ఈ ఉజ్వల తెలంగాణ భవిష్యత్ రూపకల్పన లో పాలుపంచుకున్నారు. అధునాత సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక వనరులతో పాటు సుపరిపాలన ఈ ఆర్ధిక వృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేస్తాయి.

 CURE-PURE-RARE అనే మూడు-జోన్ల అభివృద్ధి నమూనా

రాష్ట్రం లో అన్ని ప్రాంతాల  అభివృద్ధికి CURE-PURE-RARE అనే మూడు-జోన్ల అభివృద్ధి నమూనాను ఈ డాక్యుమెంట్ కీలకంగా ప్రస్తావించింది. హైదరాబాద్ సిటీ తో పాటు పరిసర ప్రాంతాలు,  గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల్య, పరస్పర ఆధారిత వృద్ధిని సాధించే సంకల్పం.  2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే మైలు రాయి ని నిర్దేశించింది. 2047 నాటికి జాతీయ GDPలో తెలంగాణ వాటా పదో వంతు కు చేరాలని లక్ష్యం గా ఎంచుకుంది.  పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణను  ప్రపంచ స్థాయి మౌలిక వసతులున్న అత్యాధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దటం.  అన్ని వర్గాలకు సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించే ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలబెట్టడాలన్ని లక్షాలుగా పెట్టుకున్నారు. 
 
 లక్ష్య సాధనకు మూడు సూత్రాలు:  

1. ఆర్థిక వృద్ధి (Economic Growth): ఆవిష్కరణలు మరియు ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం. 

2. సమ్మిళిత అభివృద్ధి (Inclusive Development): యువత, మహిళలు, రైతులు మరియు అణగారిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా చూడటం. 

3. సుస్థిర అభివృద్ధి (Sustainable Development): అన్ని రంగాలలో సుస్థిరతను పొందుపరచడం మరియు 2047 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం. 
 
 CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ):  160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న  హైదరాబాద్ సిటీ  ప్రాంతం. సేవల విస్తరణకు ప్రాధాన్యం. నెట్-జీరో సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రపంచ స్థాయి నాలెడ్జ్ మరియు ఆవిష్కరణల కేంద్రంగా ఉంటుంది. 

  PURE (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ): ఔటర్ రింగ్ రోడ్ (ORR) మరియు 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) మధ్య ఉన్న  జోన్.  తయారీ రంగానికి కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్‌లు ఏర్పాటు. 

*RARE (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ): ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) దాటి, రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతం. వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి . 

పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత. విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడం, గేమ్-ఛేంజర్ ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టించడం,  డిజిటల్ గవర్నమెంట్, T-ఫైబర్, SPEED వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం., ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించడం, మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి  అందరికీ సమాన అవకాశాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం. , వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాలను తగ్గించడం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం. , రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం.. ప్రోత్సహించడం. , పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలు రూపొందించడం వంటి పది లక్ష్యాలు ఈ డాక్యుమెంట్ లో కీలకంగా ఉన్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Advertisement

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget