Revanth Reddy : రాజగోపాల్ రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి - భువనగిరిలో గెలుపు వ్యూహాలపై చర్చ !
Telangana News : ఎంపీ రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎంరేవంత్ రెడ్డి వెళ్లారు. భువనగిరి ఎంపీ స్థానంలో గెలుపు వ్యూహాలపైచర్చించారు.
CM Revanth Reddy went to MP Rajagopal Reddy house : సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లారు. భువనగిరి పార్లమెంట్ ముఖ్య నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన విది విధానాలపై దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ కింది స్థాయి నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. భువనగిరి పార్లమెంట్ సిగ్మెంట్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయాలపై దిశా నిర్దేశం చేశారు. భువనగిరి టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలు సమన్వయంతో ముందుకు పోవాలని సీఎం వారికి సూచించారు. ఈ నెల 21న భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు వెల్లడించారు. భువనగిరిలో నామినేషన్ వేసిన తొలిరోజునే సీఎం భారీ బహిరంగ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.17 నియోజకవర్గాల్లో నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరుకానున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది.
మే మొదటి వారంలో భువనగిరిలో పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం వెల్లడించింది. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ ఎన్నికల బరిలో నిలబడనున్నారు. గత ఎన్నికల్లోనూ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలవడంతో ఎంపీగా రాజీనామా చేశారు. ప్రస్తుతం భువనగిరికి సిట్టింగ్ ఎంపీ గా ఎవరూ లేరు.
గతంలో రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఆయననే కారణంగా చూపి బీజేపీలో చేరారు. తర్వాత మళ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని.. మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. తనపై ఎన్ని విమర్శలు చేసినా.. రేవంత్ రెడ్డి.. ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడు భువనగరిలో గెలుపు బాధ్యతల్ని తీసుకునేందుకు కోమటిరెడ్డి కూడా రెడీ అయ్యారు.