అన్వేషించండి

Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!

Telangana Tourism :తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త మాస్టర్ ప్లాన్‌ను ప్రకటించారు. దుర్గం చెరువు , వికారాబాద్ , ఫ్యూచర్ సిటీపై అధికారులతో సమీక్షించారు.

Telangana Global Investment Summit December 2026:  తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక రంగ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి సరికొత్త విప్లవాత్మక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. పర్యాటక శాఖపై సోమవారం  ఆయన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఐకానిక్  దుర్గం చెరువు  పరిసరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా మార్చాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు చారిత్రక తారామతి బారాదరిని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు, హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ మంజీర, దిల్కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునీకరించి సరికొత్త హంగులు అద్దాలని సీఎం స్పష్టం చేశారు.

హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ప్రకృతి రమణీయ ప్రాంతం  వికారాబాద్  జిల్లాను ఒక మెగా టూరిజం హబ్ గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా వికారాబాద్‌లోని ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి, వీరభద్రస్వామి ఆలయాలను పూర్తిస్థాయిలో అప్‌గ్రేడ్ చేయనున్నారు. యాదాద్రి తరహాలోనే ఈ ఆలయాలకు కూడా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాన్ని డెవలప్ చేయనున్నారు. అలాగే అటవీ శాఖ పరిధిలోని  CURE ఏరియా భూములను ఎకో-టూరిజం స్పాట్లుగా మార్చాలని, గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలోనే హైదరాబాద్ నలుమూలలా అధునాతన ఎకో పార్కులను నిర్మించాలని అటవీ, పర్యాటక శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  

 మూడో నగరంగా రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ లోని అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టులుగా మార్చనున్నారు. ఈ పనులను వేగవంతం చేసేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. చారిత్రక భాగ్యనగర వారసత్వ సంపదను కాపాడే క్రమంలో భాగంగా.. మూసీ నదిపై ఉన్న పురాతన  పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జ్ ను పర్యాటకులను ఆకర్షించేలా సరికొత్త పర్యాటక వేదికగా రీ-డిజైన్ చేయనున్నారు. పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల ఆధునిక వసతులు, సౌకర్యాలను ఇక్కడ కల్పించనున్నారు. ఈ చారిత్రక వంతెనను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్  ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఈ భారీ పర్యాటక, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఏడాది డిసెంబర్ 2026 లో ప్రతిష్టాత్మక  గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్  నిర్వహించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సమ్మిట్‌కు సంబంధించిన సన్నాహక పనులను ఇప్పుడే ప్రారంభించాలని, పర్యాటక, అటవీ, మున్సిపల్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కోసం ఒక ప్రత్యేక ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిటీని   ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. రేవంత్ రెడ్డి మార్క్ ఈ నయా టూరిజం ప్లాన్.. తెలంగాణ ఆదాయాన్ని పెంచడమే కాకుండా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget