అన్వేషించండి

CM Revanth Reddy: 'నిరుద్యోగులూ నిరసనలు, ఆందోళనలు వద్దు' - అన్నగా అండగా ఉంటానన్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana News: నిరుద్యోగ సమస్యే తెలంగాణ ఏర్పాటుకు కీలకంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

CM Revanth Comments In Passing Out Parade: రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళనలు, నిరసనలు చేయాల్సిన అవసరం లేదని.. అన్నగా వారి కోసం తాను అండగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 483 ఫైర్ మెన్స్, 155 డ్రైవర్ ఆపరేటర్స్‌కు నియామక పత్రాలు అందజేశారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందించారు. 'ఫైర్‌మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు శుభాకాంక్షలు. సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన మీ అందరినీ అభినందిస్తున్నా. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే విద్య, వ్యవసాయానికి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాం.' అని తెలిపారు.

'ఒకటో తేదీనే జీతాలు'

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. నిరుద్యోగ సమస్యే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అత్యంత కీలకంగా మారిందని అన్నారు. 'గత పదేళ్లు నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూశారు. కాంగ్రెస్ హయాంలో 90 రోజుల్లోనే 31 వేల నియామక పత్రాలు అందించాం. విద్య, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. పేదలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం. వాస్తవాలకు అనుగుణంగానే బడ్జెట్ ప్రవేశపెట్టాం. అగ్నిమాపక శాఖలో ఉద్యోగం అంటే జీతభత్యాల కోసం చేసేది కాదు. ఓ సామాజిక బాధ్యతతో విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేలా విధులు నిర్వహిస్తారు. నిరుద్యోగులు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు. మంత్రులు, ఉన్నతాధికారులను కలవండి. మీకు అన్నగా అండగా ఉంటా. గ్రామాల్లో కొందరు యువకులు పేరెంట్స్‌ను సరిగ్గా చూడడం లేదని నా దృష్టికి వచ్చింది. దయచేసి మీకు రెక్కలు వచ్చాక కుటుంబాన్ని విడిచి వెళ్లొద్దని కోరుతున్నా.' అని సీఎం పేర్కొన్నారు.

Also Read: ABP Desam Health Conclave 2024: ABP దేశం హెల్త్ కాన్‌క్లేవ్‌కి మంత్రి పొన్నం హాజరు, గొప్ప సామాజిక కార్యక్రమం అంటూ ప్రశంసలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Mujra Party: ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
Best Cars: టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
Embed widget