CM KCR: పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడిన కేసీఆర్.. వరి పంటకు బదులు.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచన
రైతులు వరి పంటకు బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఇతర పంటలు వేసుకోవాలన్నారు.
సీఎం కేసీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి మరణించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో రైతులతో మాట్లాడారు. వనపర్తి జిల్లా రంగాపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న పంట పొలాల్లో వేసిన మినుము, వేరుశనగ పంటలను కేసీఆర్ పరిశీలించారు. వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు.. లాంటి పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు.
పంట పొలాల్లోకి వెళ్లిన సీఎం.. రైతులు సాగు చేస్తున్న మినుము పంటను, వేరుశనగ పంటను పరిశీలించారు. పంటకు సంబంధించిన వివరాలను రైతుల దగ్గర అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన సీఎం.. కొత్తకోట మండలం విలియం కొండ తండా రోడ్డు వద్ద కళ్లంలో ఆరబోసిన వరి ధాన్యం వద్దకు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి వెరుశెనక పంట దగ్గరకు వెళ్లి.. స్వయంగా వెరుశనగ చెట్లను తీసి.. కాయలను పరిశీలించారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట సాగును ప్రోత్సహించేలా ప్రణాళికలు చేయాలని.. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. యాసంగిలో రైతులు వరికి బదులుగా.. ప్రత్యామ్నాయ పంటల సాగు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు మంత్రులు, కలెక్టర్లకు సూచనలు చేశారు. వరికి బదులు ఇతర పంటలు సాగు చేయడం కారణంగా భూసారం కూడా పెరుగుతుందని సీఎం సూచించారు.
Also Read: ఏపీ, ఒడిశాపై జవాద్ తుపాను ప్రభావం... 100కు పైగా రైళ్ల రద్దు... ప్రధాని మోదీ సమీక్ష
Also Read: Nizamabad: యాసంగికి వరి తప్ప వేరే పంటలు వేయలేం.. నిజామాబాద్ జిల్లా ఆవేదన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి