Trains Cancelled: ఏపీ, ఒడిశాపై జవాద్ తుపాను ప్రభావం... 100కు పైగా రైళ్ల రద్దు... ప్రధాని మోదీ సమీక్ష
జవాద్ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. జవాద్ తుపాను దృష్ట్యా ఏపీ, ఒడిశాల మీదుగా నడిచే 100పైగా రైళ్లు రద్దైయ్యాయి.
జవాద్ తుపాను ప్రభావం ఏపీ, ఒడిశాలపై ఎక్కువగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో ఏపీ సీఎం జగన్ ఉత్తరాంధ్ర కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జవాద్ తుపాను కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే 100 పైగా రైళ్లను రద్దు చేసింది. ఇందులో న్యూ ఢిల్లీ-పూరీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్, పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్, ధన్‌బాద్-అలెప్పీ(బొకారో) ఎక్స్‌ప్రెస్‌తో సహా అనేక రైళ్లు ఉన్నాయి. చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాజేష్ కుమార్ రైళ్ల రద్దును నిర్థారణ చేశారు. తుపాను పరిస్థితి కారణంగా రైల్వే అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాజేష్ కుమార్ చెప్పారు.
ప్రధాని మోదీ సమీక్ష
జవాద్ తుపాన్ తీవ్రత దృష్ట్యా ప్రధాని మోదీ అధికారులతో సమావేశం నిర్వహించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో అండమాన్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. గురువారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారానికి తుపానుగా మారే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.
రేపటి నుంచి ఏపీలో వర్షాలు
డిసెంబరు 4వ తేదీ నాటికి క్రమంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరాలకు దగ్గరగా తుపాన్ వస్తుందని వాతావరణశాఖ తెలిపింది. తర్వాత పెనుతుపానుగా మారి పశ్చిమ వాయువ్యదిశగా కదులుతుందని వెల్లడించారు. తుపాన్ ప్రభావంతో రేపటి నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Also Read: వచ్చే 3 రోజులు ఏపీలో భారీ వర్షాలే.. ఈ ప్రాంతాల్లో అతి భారీగా.. వాతావరణ కేంద్రం హెచ్చరిక
02.12.2021న రద్దైన రైళ్లు
1. రైలు నం. 12508 సిల్చార్-త్రివేండ్రం సెంట్రల్
2. రైలు నం. 12509 బెంగళూరు కాంట్ -గౌహతి
3. రైలు నం. 22641 త్రివేండ్రం సెంట్రల్-షాలిమార్
4. రైలు నం. 15905 కన్యాకుమారి- దిబ్రూఘర్
5. రైలు నంబర్ 12844 అహ్మదాబాద్-పూరి
03.12.2021న రద్దైన రైళ్లు
1. రైలు నం.18417 పూరి-గుణపూర్
2. రైలు నం.20896 భువనేశ్వర్- రామేశ్వరం
3. రైలు నం. 12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా
4. రైలు నం. 22883 పూరి-యశ్వంత్‌పూర్ గరీబ్రత్
5. రైలు నం. 12245 హౌరా-యశ్వంత్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్
6. రైలు నం. 11020 భువనేశ్వర్-CST ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్
7. రైలు నం. 22605 పురూలియా - విల్లుపురం ఎక్స్‌ప్రెస్
8. రైలు నెం. 17479 పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్
9. రైలు నం. 18045 హౌరా-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
10. రైలు నం. 12841 హౌరా- MGR చెన్నై సెంట్రల్ కోరమండల్
11. రైలు నం.22817 హౌరా-మైసూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
12. రైలు నం. 22807 సంత్రాగచ్చి- MGR చెన్నై సెంట్రల్
13. రైలు నం.22873 దిఘ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
14. రైలు నం.12863 హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్
15. రైలు నం.12839 హౌరా- MGR చెన్నై సెంట్రల్ మెయిల్
16. రైలు నం. 22644 పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్
17. రైలు నం.17244 రాయగ-గుంటూరు ఎక్స్‌ప్రెస్
18. రైలు నం. 20809 సంబల్పూర్- నాందేడ్ ఎక్స్‌ప్రెస్
19. రైలు నం.18517 కోర్బా-విశాఖపట్నం
20. రైలు నం.13351 ధన్‌బాద్ -అలెప్పి
21. రైలు నం.12889 టాటా -యశ్వంత్‌పూర్
22. రైలు నెం.12843 పూరీ -అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్
23. రైలు నం.18447 భువనేశ్వర్- జగదల్పూర్
24. రైలు నం. 12842 MGR చెన్నై సెంట్రల్ -హౌరా
25. రైలు నం. 18046 హైదరాబాద్ -హౌరా
26. రైలు నం. 12829 MGR సెంట్రల్ చెన్నై- భువనేశ్వర్
27. రైలు నం. 12246 యశ్వంత్‌పూర్- హౌరా దురంతో
28. రైలు నం. 12704 సికింద్రాబాద్ -హౌరా ఫలక్‌నుమా
29. రైలు నం. 17480 తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్
30. రైలు నం. 12864 యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్
31. రైలు నం. 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్
32. రైలు నం. 12840 MGR చెన్నై సెంట్రల్ -హౌరా మెయిల్
33. రైలు నం. 18048 వాస్కో డి గామా -హౌరా
34. రైలు నం. 12664 తిరుచిరాపల్లి -హౌరా
35. రైలు నం. 18464 బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
36. రైలు నం. 11019 CST ముంబై -భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్
37. రైలు నం. 18518 విశాఖపట్నం-కోర్బా
38. రైలు నం. 18528 విశాఖపట్నం -రాయగడ ఎక్స్‌ప్రెస్
39. రైలు నం. 17243 గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్
40. రైలు నం. 18448 జగదల్పూర్ -భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్
41. రైలు నం. 20838 జునాగర్ రోడ్ -భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
Also Read: ఉత్తరాంధ్రపై విరుచుకుపడనున్న జవాద్ తుఫాన్.. ముందు జాగ్రత్తలపై సీఎం జగన్ సమీక్ష
04.12.2021న రద్దైన రైళ్లు
1. రైలు నం.18463 భువనేశ్వర్- ప్రశాంతి
2. రైలు నం.18637 హటియా -బెంగళూరు కాంట్
3. రైలు నం.22819 భువనేశ్వర్ -విశాఖపట్నం
4. రైలు నం.17015 భువనేశ్వర్- సికింద్రాబాద్
5. రైలు నం.18418 గుణుపూర్- పూరి
6. రైలు నం. 12807 విశాఖపట్నం -నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్
7. రైలు నం. 18551 విశాఖపట్నం- కిరండూల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి