అన్వేషించండి

Bandi Sanjay Birthday: బండి సంజయ్‌కు కేసీఆర్ బర్త్‌డే విషెస్, ప్రత్యేకంగా లేఖ - థ్యాంక్స్ చెప్పిన బండి

తాజాగా కేసీఆర్ బండి సంజయ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించి కేసీఆర్ ఓ లేఖ కూడా బండి సంజయ్ కు పంపారు.

రాజకీయాల్లో వివిధ పార్టీల నేతల మధ్య వైరం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా సరే చాలా మంది రాజకీయ నేతలు వ్యక్తిగతంగా స్నేహపూరితంగానే ఉంటారు. పైకి మాత్రం ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ఉంటారు. తెర వెనుక మాత్రం ఫ్రెండ్లీగానే ఉంటారు. కానీ, అతికొద్ది మంది లీడర్ల మధ్య మాత్రం కాస్త ఎక్కువ విభేదాలు ఉంటాయి. అలాంటి వారిలో కేసీఆర్, బండి సంజయ్ కూడా ఉంటారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేసీఆర్‌పై రాజకీయంగానే కాక, వ్యక్తిగతంగానూ ఘాటు విమర్శలు చేసేవారు. కేసీఆర్ కూడా అంతే దీటుగా దిమ్మతిరిగే కౌంటర్లు వేసేవారు.

అయితే, తాజాగా కేసీఆర్ బండి సంజయ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించి కేసీఆర్ ఓ లేఖ కూడా బండి సంజయ్ కు పంపారు. అందులో ‘‘శ్రీ బండి సంజయ్ గారూ.. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తున్న మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను - కే. చంద్రశేఖర్ రావు’’ అంటూ బండి సంజయ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ లేఖను బండి సంజయ్ ట్వీట్ చేస్తూ.. ‘‘నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ సీఎంవోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

గతంలో తరచూ ఘాటు విమర్శలు చేసుకునే వీరు ఉన్నట్టుండి ఇలా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పుకోవడం ఆసక్తి కలిగించింది. బండి సంజయ్ అధిష్ఠానం సూచన మేరకు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget